Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY)
ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన
అసంఘటితంగా ఉన్న మత్య్స రంగాన్ని సంఘటితం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘ ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన ’’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మత్య్సరంగాన్ని సంఘటితం చేయడంతో పాటు మత్య్సరంగ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సహయపడేలా సంస్థాగత ఆర్థిక సహాయం అందిస్తుంది.
ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన ఉద్యోగ కల్పనతో పాటు చిన్నచిన్న మత్య్స వ్యాపారవేత్తలకు, మత్య్సకార సోసైటీలకు రుణాలు అందించడం, వ్యాధుల వల్ల చేపల చెరువులు నష్టపోకుండా భీమా కల్పన, ఎగుమతుల పెంపొందించడంతో పాటు దేశీయంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
➠ లబ్దిదారులు :
- మత్య్సకారులు
- చేపల (ఆక్వాకల్చర్) రైతులు
- చేపల కార్మికులు
- చేపల విక్రేతలు
- చేపల యాజమాన్య సంస్థలు
- భాగస్వామ్య సంస్థలు
- కంపెనీలు
- సోసైటీలు
- లిమిటెడ్ లయబిలిటీ సంస్థలు
- సహకార సంస్థలు
- సమాఖ్యలు
- స్వయం సహాయక బృందాలు
- చేపల పెంపకం ఉత్పత్తిదారుల సంస్థలు
- చేపల పెంపకం
- ఆక్వాకల్చర్ విలువ గొలుసులలో నిమగ్నమైన స్టార్టప్ కంపెనీలు
- ఎఫ్‌ఎఫ్‌పిఓలలో ఫార్మర్స్ ప్రొడ్యుసర్స్ ఆర్గనైజేషన్స్
- మత్య్సశాఖ ఇతర లబ్దిదారులు
0 Comments