Attorney General of India | భారత అటార్నీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు ?

Attorney General of India

అటార్నీ జనరల్‌ 

Attorney General of India

List of attorney general of india

అటార్నీ జనరల్‌ భారత అత్యున్నత న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. అటార్నీ జనరల్‌ గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని, 1వ అధ్యాయమంలో పేర్కొన్నారు. అటార్నీ జనరల్‌ను ఆర్టికల్‌ 76 ప్రకారం ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ పదవిని బ్రిటన్‌ నుండి గ్రహించారు. అటార్నీ జనరల్‌కు సుప్రీంకోర్టు మరియు దేశంలోని అన్ని హైకోర్టులలో వాదించే అధికారం కలదు. ఇతను ప్రభుత్వానికి న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తాడు. చట్టపరమైన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందజేస్తాడు. విధి నిర్వహణలో అటార్నీ జనరల్‌కు ఇద్దరు సోలిసిటర్‌ జనరల్స్‌, నలుగురు అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్స్‌ సహాయం అందిస్తారు. అటార్నీ జనరల్‌ పదవీకాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు కొనసాగుతుంది. అటార్నీ జనరల్‌ పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొని మాట్లాడే హక్కు కలదు. కానీ ఓటు వేసే అధికారం లేదు.

అర్హతలు :

  • భారతదేశ పౌరుడై ఉండాలి
  • ఏదేని రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు లేదా న్యాయవాదిగా 10 పూర్తి చేయాలి. 
 

Also Read :


➺ అటార్నీ జనరల్‌ గురించి ముఖ్యమైన విషయాలు :

  • ఇతని గురించి ఆర్టికల్‌ 76 తెలియజేస్తుంది
  • ఈ వాక్యాన్ని బ్రిటన్‌ను నుండి గ్రహించారు.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి
  • పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చు
  • పార్లమెంట్‌ సభ్యులకు ఉన్న అధికారాలు ఉంటాయి.
  • పార్లమెంట్‌ సమావేశాల్లో ఓటు వేసే అధికారం ఉండదు
  • కేంద్రానికి సంబంధించి అన్ని రకాల వివాదాంశాలపై న్యాయస్థానాల్లో వాదిస్తాడు.
  • ఇతనికి సహయకులుగా సోలిసిటర్‌ జనరల్స్‌, అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్స్‌ ఉంటారు
  • ఇతను ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా ఉండరాదు.
  • రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు అధికారంలో కొనసాగుతాడు.
  • ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే రాష్ట్రపతికి సమర్పించాలి.

➺ అటార్నీ జనరల్‌గా పనిచేసిన వ్యక్తులు  :

  • ఎం.సి సెతల్వాడ్‌  : 1950 -1963
  • సి.కె. దప్తరి : 1963 - 1968
  • నిరిండే : 1968 - 1977
  • ఎస్‌.వి గుప్తా : 1977 - 1979
  • కె.పరాశరన్‌ : 1983 - 1989
  • సోలి జె.సొరాబ్జీ : 1989 - 1990
  • జి.రామస్వామి : 1990 - 1992
  • మిలాన్‌ కె.బెనర్జీ : 1992 - 1996
  • అశోక్‌ కె.దేశాయ్‌ : 1996 - 1998
  • సోలీ జె.సొరాబ్జి : 1998 - 2004
  • మిలాన్‌ కె.బెనర్జీ : 2004 - 2009
  • గులాం ఇ.వాహనపతి : 2009 - 2014
  • ముకుల్‌ రోహిత్గి : 2014 - 2017
  • కె.కె వేణుగోపాల్‌ : 2017 - 2022
  • ఆర్‌.వెంకటరమణి : 2022 - ఇప్పటివరకు (2025)

Post a Comment

0 Comments