Comptroller and Auditor General of India
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 5 అధ్యాయంలో 148 నుండి 151 వరకు తెలియజేస్తాయి. ఆర్టికల్ 148 ప్రకారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 150 ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ఖాతాలను కాగ్ తనిఖీచేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 151 ప్రకారం తనిఖీ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తాడు, రాష్ట్రపతి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతాడు. కాగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాష్ట్రపతికి తొలగించే అధికారం ఉంటుంది.
➯ కాగ్ పదవిని చేపట్టిన వ్యక్తులు :
- నరహరి రావ్ : 1949 - 1954
- ఎ.కె.చాంద్ : 1954 - 1960
- ఎస్.హెచ్.ఎ.కె రాయ్ : 1960 - 1966
- ఎస్.రంగనాథన్ : 1966 - 1972
- ఎ.భక్షి : 1972 - 1978
- జి.ప్రకాశ్ : 1978 - 1984
- టి.ఎన్.చతుర్వేది : 1984 - 1990
- సి.జె సోమయ్య : 1990 - 1996
- వి.కె షుంగ్లు : 1996 - 2002
- వి.ఎన్.కౌల్ : 2002 - 2008
- వినోద్‌రాయ్ : 2008 - 2013
- శశికాంత్ శర్మ : 2013 - 2017
- రాజీవ్ మహర్షి : 2017 - 2020
- గిరిష్ చంద్రముర్ము : 2020 - 2024
- కె.సంజయ్ ముర్తి : 2024 - ఇప్పటివరకు (జనవరి 2025)
0 Comments