‘BAANKNET’ e-auction Portal for e-auction of Properties
బ్యాంక్ స్వాధీన ఆస్తుల వేలానికి ఓ పోర్టల్
దేశంలోని వివిధ బ్యాంక్‌లు ఆస్తులను తాకట్టు పెట్టుకొని ఋణాలను మంజూరు చేస్తాయి. ఒకవేళ ఋణగ్రస్తులు సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో అట్టి ఆస్తులను వేలం వేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో బ్యాంకులు స్వాధీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను వేలం వేసేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ బ్యాంక్‌నెట్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు చేపట్టే ఆస్తుల వేలంకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆస్తుల వేలానికి సంబంధించిన సమాచారం ఒకేచోట లభించడంతో కొనుగోలు దారులు, ఇన్వెస్టర్లకు గణనీయంగా సహాయం లభిస్తుంది
0 Comments