‘‘పద్మ’’ అవార్డులు -2025
Padma Awards 2025
దేశ ఉన్నత పురస్కారం అయిన ‘‘ పద్మ ’’ అవార్డులు - 2025 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్య్ర దినోత్సవం సందర్బంగ ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2025 సంవత్సరానికి గాను మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో అనగా కళ, సామాజిక పని, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వాటిల్లో విశేష ప్రతిభ కనబర్చిన దేశంలోని వ్యక్తులకు ఈ 'పద్మ' అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేస్తారు.
2025 'పద్మ' అవార్డులలో 7 గురు పద్మవిభూషణ్, 19 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డులను స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను విడుదల చేసింది.
0 Comments