RRB Group D 32438 Jobs .. Railway Recruitment 2025 | రైల్వేలో 32438 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు

RRB Group D 32438 Jobs .. Railway Recruitment 2025

Railway Recruitment Board (RRB) Group D Recruitment Notification 2025 |

Railway Jobs  |  రైల్వేలో 32438 ఉద్యోగాలు..10తో రైల్వే కొలువు

నిరుద్యోగులకు శుభవార్త .. ! రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 Group-D ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 10వ తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 22 ఫిబ్రవరి 2025 లోగా ఆన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవాలి.

➺ డిపార్ట్‌మెంట్‌ :

  • రైల్వే ఆర్‌ఆర్‌బీ

విభాగాలు :

  • ఎస్‌ అండ్‌ టీ
  • మెకానికల్‌
  • ఎలక్ట్రికల్‌
  • ఇంజనీరింగ్‌
  • ట్రాఫిక్‌

దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు :

  • 32,438

పోస్టు పేరు :

  • పాయింట్స్‌మన్‌ - 5058
  • అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌) - 799
  • అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌) - 301
  • ట్రాక్‌ మెయింటెయినర్‌ గ్రూప్‌ 4 - 13187
  • అసిస్టెంట్‌ పీ`వే - 247
  • అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ) - 2587
  • అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌) - 420
  • అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌) - 3077
  • అసిస్టెంట్‌ (ఎస్‌అండ్‌టీ) - 2012
  • అసిస్టెంట్‌ టీఆర్‌డీ - 1381
  • అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌) - 950
  • అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ (ఎలక్ట్రికల్‌) - 744
  • అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ - 1041
  • అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ (వర్క్‌షాప్‌) - 625

 

Also Read :



ఆర్‌ఆర్‌బి సికింద్రాబాద్‌ జోన్‌ ఖాళీలు :

మొత్తం - 1642 పోస్టులు

  • ఓసీ - 710
  • ఎస్సీ - 235
  • ఎస్టీ - 144
  • ఓబీసీ - 415
  • ఈడబ్ల్యూఎస్‌ - 136

విద్యార్హత :

  • 10వ తరగతి / ఐటీఐ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వోకేషనల్‌ ట్రైనింగ్‌ జారీ చేసిన అప్రెంటిస్‌ సర్టిఫికేట్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత 
  • నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు

వయస్సు :

  • 01 జనవరి 2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

(ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు)

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥250/-(మహిళలు,ఎస్సీ,ఎస్టీ)
  • రూ॥500/-(ఇతరులకు)

పరీక్షకు హజరైనవారికి బ్యాంక్‌ చార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు.

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

పరీక్షా విధానం :

మొత్తం 100 మార్కులకు 90 నిమిషాల్లో అబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పరీక్షలో ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పరీక్షా సిలబస్‌ :

  • జనరల్‌ సైన్స్‌ - 25 ప్రశ్నలు
  • మ్యాథమెటిక్స్‌ - 25 ప్రశ్నలు
  • జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ - 30 ప్రశ్నలు
  • జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ - 20 ప్రశ్నలు

ఎంపిక విధానం :

  • పరీక్షా
  • ఫిజికల్‌ టెస్టు
  • మెడికల్‌ టెస్టు


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 22 ఫిబ్రవరి 2025 


For Online Apply 

Click Here


Also Read :


Post a Comment

0 Comments