
TS Ekalavya Model Schools Admissions
తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ(model) గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఈఎంఆర్‌ఎస్ సెలక్షన్ టెస్టు-2025 ద్వారా అడ్మిషన్‌లు పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1380 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. 16 మార్చి 2025న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 100 రూపాయలు ఫీజు చెల్లించి 16 ఫిబ్రవరి 2025 లోగా ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ పాఠశాల పేరు :
- తెలంగాణ ఏకలవ్య ఆదర్శ (model) గురుకుల పాఠశాల
➺ అడ్మిషన్ :
- 6వ తరగతి
➺ పాఠశాలలు :
- ఆసిఫాబాద్ జిల్లా - ఉట్నూర్, సిర్పూర్
- ఆదిలాబాద్ జిల్లా - ఇంద్రవెల్లి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - గండుగలపల్లి, పాల్వంచ, గుండాల, టేకులపల్లి, చర్ల, దమ్ముగూడెం, ముల్కలపల్లి
- నాగర్‌కర్నూల్ జిల్లా - కల్వకుర్తి
- మహబూబ్‌నగర్ జిల్లా - బాలానగర్
- మహబూబాబాద్ జిల్లా - కురవి, సీరోలు, బయ్యారం, కొత్తగూడ, గూడూరు
- కామారెడ్డి జిల్లా - గాంధారి
- నిజామాబాద్ జిల్లా - ఇందల్వాయి
- రాజన్నసిరిసిల్ల జిల్లా - మర్రిమడ్ల, ఎల్లారెడ్డిపేట
- ఖమ్మం జిల్లా - సింగరేణి
➺ అర్హత :
- 2024-25 అకడమిక్ సంవత్సరంలో 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
- 31 మార్చి 2025 నాటికి 10 నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి
Also Read :
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- రూల్ ఆఫ్ రిజర్వేషన్
➺ పరీక్షా విధానం :
మొత్తం 100 మార్కులతో నిర్వహించే పరీక్షలో మెంటల్ ఎబిలిటి నుండి 50 ప్రశ్నలు, ఆర్థమెటిక్ నుండి 25 ప్రశ్నలు, లాంగ్వేజ్ (తెలుగు,ఇంగ్లీష్) నుండి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ➺ వసతులు :
- ఉచిత వసతి
- భోజనం
- విద్య
- శిక్షణ
➺ బోధన :
- ఇంగ్లీష్ మీడియం (సీబీఎస్‌ఈ)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 ఫిబ్రవరి2025
- అడ్మిషన్ టెస్టు :16 మార్చ్ 2025
For Online Apply
0 Comments