Indian History : Vedic period Gk Questions in Telugu with Answers | Gk Questions in Telugu

Indian History : Vedic period Gk Questions in Telugu with Answers

వైదిక యుగం (ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు  

Vedic period (Indian History) Gk Questions in Telugu with Answers

 

Gk Questions in Telugu

☛ Question No.1
భారతదేశ చరిత్రలో వైదిక యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు ?
ఎ) క్రీ.పూ.1600-800
బి) క్రీ.పూ.1500-600
సి) క్రీ.పూ.1400-700
డి) క్రీ.పూ.1800-600

జవాబు : బి) క్రీ.పూ.1500-600

☛ Question No.2
వైదిక యుగ నిర్మాతలుగా ఎవరిని పేర్కొంటారు ?
ఎ) ఆర్యులు
బి) మౌర్యులు
సి) ఎ, బి
డి) ఏవి కావు

జవాబు : ఏ) ఆర్యులు 

☛ Question No.3
ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఏది ?
ఎ) అధర్వణ వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) రుగ్వేదం

జవాబు : డి) రుగ్వేదం

☛ Question No.4
ఈ క్రింది గ్రంథాలలో ఏది ఆర్య సాహిత్య తొలి రచనగా పిలువబడుతుంది ?
ఎ) ఉపనిషత్తులు
బి) రామాయణం
సి) ఋగ్వేదం
డి) మహాభారతం

జవాబు : సి) ఋగ్వేదం

☛ Question No.5
ఏ వేదంలో సంగీత శ్లోకాలు ఉన్నాయి ?
ఎ) ఋగ్వేదం
బి) సామవేదం
సి) యజుర్వేదం
డి) అధర్వణ వేదం

జవాబు : బి) సామవేదం

☛ Question No.6
ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి ?
ఎ) ఆచారాలు, త్యాగాలు
బి) తాత్త్విక శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం
సి) యుద్ధం మరియు రాజకీయాలు
డి) వ్యవసాయ, వాణిజ్యం

జవాబు : బి) తాత్త్విక శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం



☛ Question No.7
మొత్తం ఉపనిషత్తులు ఎన్ని ?
ఎ) 80
బి) 30
సి) 108
డి) 60

జవాబు :సి) 108

☛ Question No.8
‘‘సత్యమేవ జయతే’’ అనే ప్రముఖ శ్లోకం ఎందులో కనిపిస్తుంది ?
ఎ) ఉపనిషత్తులు
బి) అధర్వణ వేదం
సి) ఋగ్వేదం
డి) యజుర్వేదం

జవాబు : ఎ) ఉపనిషత్తులు

☛ Question No.9
అష్టాదశ పురాణాల్లో అతి ప్రాచీనమైనవి ఏవి ?
ఎ) గరుడ పురాణం
బి) వాయు పురాణం
సి) భాగవత పురాణం
డి) విష్ణు పురాణం

జవాబు : బి) వాయు పురాణం

☛ Question No.10
భారతదేశంలోనే కాకుండా మొత్తం ఇండో-యూరోపియన్‌ సాహిత్యంలోనే అతి ప్రాచీనమైన వేదం ఏది ?
ఎ) అధర్వణ వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) ఋగ్వేదం ‌

జవాబు : డి) ఋగ్వేదం

☛ Question No.11
ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి ?
ఎ) 1028
బి) 960
సి) 580
డి) 360

జవాబు : ఎ) 1028

☛ Question No.12
ఏ వేదంలో ‘‘గాయత్రి మంత్రం’’ పొందుపరచబడి ఉంది ?
ఎ) అధర్వణ వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) ఋగ్వేదం

జవాబు : డి) ఋగ్వేదం ‌

☛ Question No.13
ఋగ్వేదాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు ?
ఎ) 12
బి) 10
సి) 15
డి) 18

జవాబు : బి) 10 ‌

☛ Question No.14
ఋగ్వేదంలోని ఏ మండలంలో ‘‘గాయత్రి మంత్రం’’ పొందుపరచబడి ఉంది ?
ఎ) 5
బి) 4
సి) 2
డి) 3

జవాబు : డి) 3 ‌

☛ Question No.15
సంగీత ప్రధానమైన సామవేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి ?
ఎ) 1400
బి) 1200
సి) 1600
డి) 1300

జవాబు : సి) 1600 ‌


Also Read :


☛ Question No.16
భారతీయ సప్త స్వరాలకు మూలం దేనిలో ఉన్నట్లు చెబుతారు ?
ఎ) అధర్వణ వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) ఋగ్వేదం

జవాబు : సి) సామవేదం ‌

☛ Question No.17
రాజులు నిర్వహించే రాజసూయ, వాజపేయ లాంటి యాగాలకు సంబంధించిన తొలి ప్రస్తావన దేనిలో కనిపిస్తుంది ?
ఎ) అరణ్యకాలు
బి) యజుర్వేదం
సి) ఉపనిషత్తులు
డి) బ్రాహ్మాణాలు

జవాబు : బి) యజుర్వేదం ‌

☛ Question No.18
అధర్వణ వేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి ?
ఎ) 750
బి) 730
సి) 711
డి) 740

జవాబు : సి) 711 ‌

☛ Question No.19
అధర్వణ వేదంలో ఉన్న భాగాలు ఏవి ?
ఎ) పైప్పలాద
బి) సౌనక
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : సి) ఎ మరియు బి ‌

☛ Question No.20
ప్రాచుర్యం పొందిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ శ్లోకం ఏ గ్రంథంలో ఉంది ?
ఎ) ఐతరేయ బ్రాహ్మణం
బి) యజుర్వేద సంహిత
సి) బృహదారణ్యక ఉపనిషత్తు
డి) భాగవత పురాణం

జవాబు : సి) బృహదారణ్యక ఉపనిషత్తు ‌

☛ Question No.21
వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులకు మధ్య అనుసంధానాలుగా వేటిని భావిస్తారు ?
ఎ) అరణ్యకాలు
బి) స్మృతి సాహిత్యం
సి) శ్రౌత సూత్రాలు
డి) గృహ్య సూత్రాలు

జవాబు :ఎ) అరణ్యకాలు ‌

☛ Question No.22
ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా లభించే సాహిత్యం ఏమంటారు ?
ఎ) అరణ్యకాలు
బి) స్మృతి సాహిత్యం
సి) శ్రౌత సూత్రాలు
డి) గృహ్య సూత్రాలు

జవాబు : బి) స్మృతి సాహిత్యం ‌

☛ Question No.23
ఈ క్రిందివాటిని గుర్తించండి ?
1) ఆయుర్వేదం - వైద్యశాస్త్రం
2) గాంధర్వ వేదం - గానం, సంగీతం
3) శిల్ప వేదం - వాస్తు, శిల్పకళ
4) ధనుర్వేదం - యుద్దవిద్యలు

ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2 మరియు 4
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4

జవాబు : సి) 1, 2, 3 మరియు 4 ‌

☛ Question No.24
వేదవ్యాసుడు రచించిన ‘మహాభారతం’ ను మొదట ఏమని పిలిచేవారు ?
ఎ) వైశేషిక
బి) పూర్వ మీమాంస
సి) నిరుక్త
డి) జనసంహిత

జవాబు : డి) జనసంహిత ‌

☛ Question No.25
సుమారు క్రీ.పూ 500 ఏళ్ల క్రింద వాల్మికి రచించిన ‘రామాయణం’లో ఎన్ని ఖండాలున్నాయి ?
ఎ) 8
బి) 7
సి) 9
డి) 11

జవాబు : బి) 7 ‌

☛ Question No.26
ప్రపంచ సృష్టి, వినాశనం, పున:సృష్టి, సూర్య,చంద్ర వంశీకుల చరిత్ర దేనిలో ఉన్నాయి ?
ఎ) పురాణాలు
బి) ఇతిహాసాలు
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : ఎ) పురాణాలు ‌

☛ Question No.27
మానవుని జీవితాన్ని నియమబద్దం చేసేందుకు వేటిని రచించారు ?
ఎ) పురాణాలు
బి) ఇతిహాసాలు
సి) ధర్మశాస్త్రాలు
డి) ఉపనిషత్తులు

జవాబు : సి) ధర్మశాస్త్రాలు ‌

☛ Question No.28
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) కల్ప - క్రతువులు
బి) నిరుక్త - పద వ్యుత్పత్తి
సి) ఛందస్సు - ప్రాస, లయ
డి) జ్యోతిష - ఉచ్ఛారణ

జవాబు : డి) జ్యోతిష - ఉచ్ఛారణ ‌

☛ Question No.29
‘ఆర్య’ అనేది జాతికి సంబంధించిన పదం అని వాదించిన విదేశీ చరిత్రకారుడు ఎవరు ?
ఎ) గైల్‌
బి) మాక్స్‌ ముల్లర్‌
సి) సర్‌ వినియమ్‌ జోన్స్‌
డి) పెంకా

జవాబు : డి) పెంకా ‌

☛ Question No.30
వేదాలు - వాటి పురోహితులకు సంబంధించి కిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) అధర్వణ వేదం ` శ్రామణుడు
బి) యజుర్వేదం ` అధ్వర్యు
సి) సామవేదం ` ఉద్గాత్రి
డి) రుగ్వేదం ` హోత్రి

జవాబు : ఎ) అధర్వణ వేదం ` శ్రామణుడు ‌


Also Read :



Post a Comment

0 Comments