Constituent Assembly of India
భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు పద్దతులున్నాయి. ఒకటి పార్లమెంటు ద్వారా రాజ్యాంగాన్ని నిర్మించడం, రెండోది ప్రత్యేక పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి రూపొందించడం.
మే 19 1928న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షునిగా, 9 మంది సభ్యులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికను ‘‘నెహ్రూ రిపోర్టు’’ అంటారు. ఇది భారతదేశంలో రాజ్యాంగ రచనకు చేసిన మొదటి ప్రయత్నం. 1946 సంవత్సరంలో కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ 208 స్థానాలు, ముస్లింలీగ్ 73 స్థానాలు, యూనియనిస్ట్ ఒక స్థానం సాధించాయి.
రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన తెలుగువారు టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కళావెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జీ రంగా, వీసీ కేశవరావు, ఎం.తిరుమలరావు, బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావులు ఉన్నారు.
రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 389 సభ్యులున్నారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 09 డిసెంబర్ నుండి 12 డిసెంబర్ 1946 వరకు జరిగింది. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి 211 మంది హజరయ్యారు. ఈ సమావేశానికి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హెచ్‌సీ ముఖర్జీని ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యాంగ పరిషత్ అనేక కమిటీలు, విషయ కమిటీలు, ఉప, మైనర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో 29 అగస్టు 1947న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ అతి ముఖ్యమైనది.
➺ ముసాయిదా కమిటీ సభ్యులు :
- డా॥బి.ఆర్ అంబేడ్కర్ (అధ్యక్షులు)
- కె.యం మున్షీ (మాజీ గృహశాఖ మంత్రి, బాంబే)
- అల్లాడి కృష్ణస్వామి (మాజీ అడ్వకేట్ జనరల్, మద్రాస్ రాష్ట్రం)
- ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ (జమ్మూ, కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి, నెహ్రూ మంత్రిమండలిలో సభ్యులు)
- బి.యల్.మిట్టర్ (భారతదేశ మాజీ అడ్వకేట్ జనరల్)
- మహమ్మద్ సాదుల్లా (అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ముస్లీంలీగ్ సభ్యులు)
- డి.పి ఖైతాన్ (న్యాయవాది)
0 Comments