NTA NCET 2025 Notification | ఇంటర్‌తో బీఈడీ చేయాలనుకుంటున్నారా ..

NTA NCET 2025 Notification

NCET : Integrated Teacher Education Programme (ITEP) Test Online Apply | ఇంటర్‌తో ఎన్‌ఐటీ, ఐఐటీల్లో బీఈడీ

ఇంటర్‌తో బీఈడీ చేయాలనుకుంటున్నారా .. 
నాలుగేళ్లలో బీఈడీ పూర్తి
డిగ్రీ మరియు బీఈడీ నాలుగేళ్లలో పూర్తి 

ఇంటిగ్రేటేడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఎన్‌సీఈటీ) - 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఆర్‌ఐఈలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు / యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ కల్పిస్తారు. 

ఇంటర్మిడియట్‌ పూర్తి చేసిన తర్వాత ఒకే సమయంలో డిగ్రి మరియు బీఈడీ పూర్తి చేయవచ్చు. జాతీయ  విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సమీకృత బీఈడీ కోర్సు (ఇంటిగ్రేటేడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌) కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విద్యావిధానం ప్రకారం బీఈడీ చేయాలంటే మూడు సంవత్సరాల డిగ్రీ, రెండేళ్ల బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులుగా ఉండేవారు. దీనికి మొత్తం 5 సంవత్సరాలు ఉండేది. సమీకృత బీఈడీ కోర్సు ద్వారా నాలుగు సంవత్సరాలలోనే డిగ్రీతో పాటు బీఈడి పూర్తి చేసే అవకాశం ఉంది. 

జాతీయ స్థాయిలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) ఈ నాలుగు సంవత్సరాల కోర్సు కొరకు  వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించేందుకు తెలంగాణలోని మూడు కాలేజీలు(మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్‌ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల), ఆంధ్రప్రదేశ్‌లో (తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలోనిలో డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ) లను ఎంపిక చేయడం జరిగింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తిస్తారు. 

ఇంటర్మిడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్షకు అర్హులు అవుతారు.

➯ కోర్సులు :

  • బీఏ - బీఈడీ
  • బీకాం - బీఈడీ
  • బీఎస్సీ - బీఈడీ

విద్యార్హత :

  • ఇంటర్మిడియట్‌ ఉత్తీర్ణత

వయస్సు :

  • పరిమితి లేదు

సీట్లు :

తెలంగాణలో

  • ఉర్దూ వర్సిటీ - 150
  • వరంగల్‌ ఎన్‌ఐటీ - 50
  • లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల - 50

ఆంధ్రప్రదేశ్‌లో

  • నేషనల్‌ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి - 50
  • శ్రీకాకుళం బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో - 100

ధరఖాస్తు రుసుము :

  • రూ॥1200/- (జనరల్‌)
  • రూ॥1000/- (ఓబీసీ,ఈడబ్ల్యూఎస్‌)
  • రూ॥650/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 16 మార్చి 2025



Also Read :



Post a Comment

0 Comments