చరిత్రలో తెలంగాణ కవులు - సాహిత్యం .. జీకే ప్రశ్నలు - జవాబులు
Telangana Writers in History Gk Questions with Answers
☛ Question No.1
తెలంగాణ ప్రాంతంలోని అటవీ జాతుల గురించి ఎవరి శిలాశాసనంలో ప్రసావించారు ?
ఎ) అశోకుడి 13వ శిలాశాసనం
బి) గూడూరి శాసనం
సి) హన్మకొండ శాసనం
డి) మాటేడు శాసనం
జవాబు : ఎ) అశోకుడి 13వ శిలాశాసనం
☛ Question No.2
ఎవరి సాహిత్యంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆహార, సామాజిక విషయాల గురించి ప్రస్తావించారు ?
ఎ) మేఘసందేశం
బి) సేతుబంధం
సి) సంగం
డి) మాలతీమాధవం
జవాబు : సి) సంగం
☛ Question No.3
గుణాడ్యుడు ఏ భాషలో ‘‘బృహత్‌కథ’’ రచించాడు. ?
ఎ) తెలుగు
బి) పైశాచి
సి) సంస్కృతం
డి) ప్రాకృతం
జవాబు : బి) పైశాచి
☛ Question No.4
తెలంగాణ మొదటి లిఖిత కవిగా గుర్తింపు సాధించిన కవి ఎవరు ?
ఎ) కాళిదాసు
బి) రెండో ప్రవరసేనుడు
సి) హాలుడు
డి) గుణాడ్యుడు
జవాబు : డి) గుణాడ్యుడు
☛ Question No.5
చరిత్రకారుదల ప్రకారం గుణాడ్యుడు బృహత్‌కథను ఏ ప్రాంతంలో రచించాడు ?
ఎ) మెదక్
బి) వరంగల్
సి) నిజామాబాద్
డి) మహబూబ్‌నగర్
జవాబు : ఎ) మెదక్
☛ Question No.6
శాతవాహన వంశానికి చెందిన స్వయంగా కవి అయిన హాలుడు ‘‘గాథాసప్తశతి’’ గ్రాంథాన్ని ఏ భాషలో రచించాడు ?
ఎ) తెలుగు
బి) పైశాచి
సి) సంస్కృతం
డి) ప్రాకృతం
జవాబు : డి) ప్రాకృతం
☛ Question No.7
దేవాలయాలు నిర్మించిన తొలి రాజులు ఎవరు ?
ఎ) శాతవాహనులు
బి) వాకాటకులు
సి) ఇక్ష్వాకులు
డి) కాకతీయులు
జవాబు : సి) ఇక్ష్వాకులు
☛ Question No.8
సంస్కృత భాషలో శాసనాలు ముద్రించిన తొలి దక్షిణ భారత రాజులు ఎవరు ?
ఎ) ఇక్ష్వాకులు
బి) వాకాటకులు
సి) శాతవాహనులు
డి) కాకతీయులు
జవాబు : ఎ) ఇక్ష్వాకులు
☛ Question No.9
వాకాటక రాజ్యంలో నివసించిన నవరత్నాల్లో ఒకడైన కాళిదాసు ఏ నాటకాన్ని రచించాడు ?
ఎ) మాలతీమాధవం
బి) జనాశ్రయ చంధో విచ్చిత్తి
సి) సేతుబంధం
డి) మేఘదూతం (మేఘ సందేశం)
జవాబు :డి) మేఘదూతం (మేఘ సందేశం)
☛ Question No.10
శ్రీరాముడు లంకా నగరంపై చేసిన దాడి ఇతివృత్తంగా రెండో ప్రవరసేనుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) మాలతీమాధవం
బి) జనాశ్రయ చంధో విచ్చిత్తి
సి) సేతుబంధం
డి) కవిరాజమార్గం
జవాబు : సి) సేతుబంధం
☛ Question No.11
విష్ణుకుండినుల కాలంలో ‘‘జనాశ్రయ చంధో విచ్చిత్తి’’ గ్రంథం రచించిన కవి ఎవరు ?
ఎ) జయసింహవల్లభుడు
బి) మాధవవర్మ
సి) భవభూతి
డి) కాళిదాసు
జవాబు : బి) మాధవవర్మ
☛ Question No.12
ఈ క్రిందివాటిలో భవభూతి నాటకాలు ఏవి ?
ఎ) ఉత్తర రామ చరిత
బి) మహావీర చరిత్ర
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.13
రాష్ట్రకుటుల కాలంలో అమోఘవర్షుడు ఏ భాషలో ‘కవిరాజ మార్గం’ రచించాడు ?
ఎ) తెలుగు
బి) కన్నడ
సి) సంస్కృతం
డి) ప్రాకృతం
జవాబు :బి) కన్నడ
☛ Question No.14
ఈ క్రింది వాటిలో ‘చంధోవిచ్చిత్తి’ గ్రంథం ఏది ?
ఎ) మాలతీమాధవం
బి) కవిరాజ మార్గం
సి) సేతుబంధం
డి) రత్నమాలిక
జవాబు : డి) రత్నమాలిక
Also Read :
☛ Question No.15
తెలుగులో తొలి గద్య శాసనం ఏది ?
ఎ) కొరివి శాసనం
బి) యశస్తిలక చంపువు
సి) గోకర్ణ చందస్సు
డి) ఉదయాదిత్యాలంకారం
జవాబు : ఎ) కొరివి శాసనం
☛ Question No.16
వేములవాడ చాళుక్యరాజు ఆస్థాన కవి అయిన పంపకవి రచన ఏది ?
ఎ) విక్రమార్జున విజయం
బి) యశస్తిలక చంపువు
సి) గోకర్ణ చందుస్సు
డి) ఉదయాదిత్యాలంకారం
జవాబు : ఎ) విక్రమార్జున విజయం
☛ Question No.17
ఈ క్రింది వాటిలో పంపకవి యొక్క రచనలు ఏవి ?
ఎ) ఆదిపురాణం
బి) జినేంద్రపురాణం
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.18
మూడో హరికేసరి ఆస్థాన కవి అయిన సోమదేవసూరి ఏ గ్రంథాన్ని రచించాడు ?
ఎ) నృత్య రత్నావళి
బి) కథా సరిత్సాగరం
సి) పండితారాధ్య చరిత్ర
డి) నీతిసారం
జవాబు : బి) కథా సరిత్సాగరం
☛ Question No.19
నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథకర్త ఎవరు ?
ఎ) రేచన
బి) ఉదయాదిత్యుడు
సి) ఒకటో గోకర్ణుడు
డి) బద్దెన
జవాబు : డి) బద్దెన
☛ Question No.20
కవిజనాశ్రయం గ్రంథకర్త ఎవరు ?
ఎ) రేచన
బి) ఉదయాదిత్యుడు
సి) ఒకటో గోకర్ణుడు
డి) జయపసేనాని
జవాబు : ఎ) రేచన
☛ Question No.21
కందూరి చోళుల కాలంలో ఒకటో గోకర్ణుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) తర్కరత్నం
బి) గీత రత్నావళి
సి) ఉదయాదిత్యాలంకారం
డి) కవిరాజమార్గం
జవాబు :సి) ఉదయాదిత్యాలంకారం
☛ Question No.22
ఎవరి కాలంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది ?
ఎ) కళ్యాణి చాళుక్యులు
బి) రాష్ట్ర కుటులు
సి) కందూరి చోళులు
డి) కాకతీయులు
జవాబు : సి) కందూరి చోళులు
☛ Question No.23
ఈ క్రింది వాటిలో కందూరి చోళులకాలం నాటి రచయితల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) వీరి కాలంలో ఒకటో గోకర్ణుడు ‘గోకర్ణ చంధస్సు’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
2) విరియాల కామసాని గూడూరి శాసనం వేయించాడు
3) నరహారి ‘బాలచిత్తాను రంజన’, స్మృతి దర్పణం, తర్కరత్నం అనే రచనలు చేశాడు.
4) ఉదయాదిత్యుడు ‘ఉదయాదిత్యాలంకారం’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : బి) 1, 2 మరియు 3
☛ Question No.24
కాకతీయుల మొదటి తెలుగు గద్య, పద్యాత్మక శాసనం అయిన మాటేడు శాసనాన్ని ఎవరు రచించారు ?
ఎ) గణపతిదేవుడు
బి) అచింతేంద్రయతి
సి) రుద్రదేవుడు / ప్రతాపరుద్రుడు
డి) రెండో ప్రోలరాజు
జవాబు : డి) రెండో ప్రోలరాజు
☛ Question No.25
ఈ క్రిందివాటిలో పాల్కురికి సోమనాథుడు రచన కానిది ఏది ?
1) పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సార సూక్తులు
2) సోమనాథభాష్యం, రుద్రభాష్యం
3) బసవరగడ, గంగోత్పత్తి రగడ
4) శ్రీ బసవాద్య రగడ, సద్గురు రగడ
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3 మరియు 4
డి) 1 మరియు 2
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
☛ Question No.26
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) రుద్రదేవుడు / ప్రతాపరుద్రుడు
2) పాల్కురికి సోమనాథుడు
3) జయపసేనాని
4) అచింతేంద్రయాతి
ఎ) బసవపురాణం, బెజ్జమహాదేవి
బి) హన్మకొండ శాసనం
సి) నాట్య రత్నావళి, నృత్య రత్నావళి
డి) నీతిసారం
ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
జవాబు : ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
0 Comments