Brahmaputra River | Indian Geography | Indian Rivers
బ్రహ్మపుత్ర నది
బ్రహ్మపుత్ర నది భారతదేశంతో పాటు టిబెట్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ‘దిహంగ్ ’ అని, అస్సాం లో ‘సైడంగ్’ అని, బంగ్లాదేశ్‌లో ‘జమున’ అని, టిబెట్‌లొ ‘సాంగ్పో’ అని, చైనాలో ‘యార్లుంగ్ జంగ్బో జియాంగ్’ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది షమ్‌యంగ్‌డంగ్ హిమానీనదం (మానససరోవరం) వద్ద ఉద్భవిస్తుంది. దీనికి సువంసిరి, కమెంగ్, ధన్‌సిరి, మనస్, టీత్స, దిసంగ్, బుర్హిదిహింగ్, లోహిత్ అనే ఉపనదులు ఉన్నాయి. భారతదేశంలో అరుణాచల్‌ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది మొత్తం 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది భారతదేశంలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు బంగ్లాదేశ్‌లోని గెలుండా అనే ప్రాంతం వద్ద కలుస్తాయి. ఈ రెండు నదులు కలిసిన తర్వాత బ్రహ్మపుత్ర నదిని మేఘన అని పిలుస్తారు. ఈ నదిని అస్సాం దుఖ:దాయానిగా పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపైన కొపిలి జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. ఈ నది హిందువులకు పవిత్రమైన నది. ఈ నది ఉహించలేని వరదలకు ప్రసిద్ది చెందింది. సాధారణంగా అలలు సముద్రాలకు మాత్రమే వస్తాయి. కానీ ప్రపంచంలో ‘టైడల్ బోర్’ (అలలపోటు)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఈ బ్రహ్మపుత్ర నది ఒకటి.
బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అన్ని నదులకన్న ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తుంది. ఈ నది భారతదేశంలోనే ఏకైక పురుష (మగ) పేరు కల్గిన నదిగా పేరుగాంచింది. ఇది చైనాలోని టిబెట్‌లో పుడుతుంది. బంగ్లాదేశ్‌లో బ్రహ్మపుత్ర నది రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా ‘జమున’ నదిగా సాగి దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. వేరొక బ్రహ్మపుత్ర నది ‘మేఘ్నానదిలో’ కలుస్తుంది. ఈ రెండు నదులు బంగ్లాదేశ్‌లోని ‘చాంద్‌పూర్’ అనే ప్రాంతం వద్ద కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయి. బ్రహ్మపుత్రి నది ప్రతి సంవత్సరం భారీ వరదలు సృష్టిస్తుంది. ఈ వరద తాకిడికి దాని గమనాన్ని మారుస్తుంది. తద్వారా కొత్త భూభాగాలు దీని తీరంలో ఏర్పడుతుంటాయి. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతంలోని వర్షారణ్యాలు అనేక రకాల వృక్షజాతులు, జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. ఇది కజిరంగా, మానస్ మరియు కాంచన్‌గంగా వంటి జాతీయపార్కులకు కల్గి ఉంది. దేశంలోని గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, సింధూ, మహా, కావేరి, తపతి వంటి అన్నీ నదులు స్త్రీ పేర్లతో ఉండగా బ్రహ్మపుత్ర నది మాత్రం పురుషపేరుతో పిలుస్తారు.
Related Posts :
3) Kaleshwaram Project in Telugu
4) Telangana Rivers Gk Questions in Telugu
5) Telangana River System in Telugu
0 Comments