Telangana Rajiv Yuva Vikasam Scheme
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘‘రాజీవ్ యువ వికాసం’’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి రూ॥6వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 5 లక్షల నిరుద్యోగులకు రాయితీ పద్దతిలో ఆర్థిక సహాకారం అందించడం కోసం ‘‘రాజీవ్ యువ వికాసం’’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు రూ॥4లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. అర్హులైన అభ్యర్థులు 14 ఏప్రిల్ 2025 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ పథకం పేరు :
- రాజీవ్ యువ వికాసం
➺ రాష్ట్రం :
- తెలంగాణ
➺ అర్హత :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబిసీ నిరుద్యోగులు
- తెలంగాణ నివాసి అయి ఉండాలి
- ధరఖాస్తు సమయంలో నిరుద్యోగిగా ఉండాలి
➺ ఎంత వరకు ఋణం మంజూరి చేస్తారు ?
- 4 లక్షల వరకు
➺ సబ్సీడీ ఎంత ఉంటుంది ?
- 40 నుండి 80 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- ఆధార్ కార్డు
- రేషన్‌కార్డు
- కులం సర్టిఫికేట్
- ఆదాయం సర్టిఫికేట్
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- పాన్‌కార్డు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 ఏప్రిల్ 2025
0 Comments