Historical Background of Indian Constitution (Indian Polity)
భారత రాజ్యాంగం ముఖ్యమైన చట్టాలు :
➺ రెగ్యులేటింగ్ చట్టం (1773) :
ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. బ్రిటీష్ తూర్పు ఇండియా కంపెనీ పనులను క్రమబద్దం చేసి, నిర్వహించడానికి బ్రిటిష్ ప్రభుత్వం దీనిని అమలు చేసింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ రచనకు పునాదిగా భావించవచ్చు. ఈ చట్టంలో గవర్నర్ విధులు, హోదాలు పొందుపరిచారు. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకునే వీలు కల్పించింది. వారెన్ హెస్టింగ్ ‘‘కలెక్టర్’’ పదవిని తొలిసారిగా అమలు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తిగా ‘సర్ ఎలిజా ఇంఫే’
ను నియమించారు.
➺ పిట్స్ ఇండియా చట్టం (1784) :
1773లో ప్రవేశపెట్టిన రెగ్యులేటింగ్ చట్టంలోని తప్పులను సవరించాడిని పిట్స్ ఇండియా చట్టం అమల్లోకి తెచ్చారు. బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన పిట్ పేరుమీదుగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారానే ఇండియాలో ద్వంద్వ పాలన అమల్లోకి వచ్చింది.
చార్టర్ చట్టాలు
➺ చార్టర్ చట్టం (1793) :
ఈ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు చట్టబద్దత, గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మాణాలపై వీటో అధికారం ఇచ్చారు. ఇండియాలో వ్యాపార అధికారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించారు.
➺ చార్టర్ చట్టం (1813) :
ఈ చట్టం ద్వారా భారతదేశంలోకి క్రైస్తవ మిషనరీలు వచ్చాయి. స్థానిక సంస్థల్లో పన్నులు విధించే పద్దతి ప్రవేశపెట్టింది. విద్యకు నిధులు కేటాయించింది. భారత్‌లో స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టి భారత్‌లో వ్యాపార హక్కులను మరో 20 సంవత్సరాలు పొడిగించింది.
➺ చార్టర్ చట్టం (1833) :
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని భారతీయ గవర్నర్ జనరల్‌గా మార్చి మొదటి భారత గవర్నర్ జనరల్‌గా విలియం బెంటింక్‌ను నియమించారు. ఈ చట్టం ద్వారా ‘‘లా’’ కమిషన్‌ను ప్రవేశపెట్టి మొదటి చైర్మన్‌గా లార్డ్ మెకాలేను నియమించారు. రాజారామ్‌మోహన్‌రాయ్ కోరిక మేరకు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. భారత్‌లో వ్యాపార హక్కులను మరో 20 సంవత్సరాలు పొడిగించింది.
0 Comments