యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ‘‘యువికా’’ ప్రోగ్రామ్
9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం .. !
‘‘యువికా’’ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్
పిల్లల ఆలోచనలు మెరుగు పరిచేందుకు, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్కూల్ విద్యార్థినీవిద్యార్థుల కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ‘‘యువ విజ్ఞాన కార్యక్రమ్ (యువికా)’’. యువికా లో పాల్గొనే విద్యార్థుల కోసం ఆన్లైన్ ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 23 మార్చి 2025 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ ప్రోగ్రామ్ పేరు :
- ‘‘యువ విజ్ఞాన కార్యక్రమ్ (యువికా)’’
➺ నిర్వహించు సంస్థ :
- భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
➺ ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు ?
- 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు
➺ ఎంపిక ఎలా ఉంటుంది ?
- 8వ తరగతిలో వచ్చిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
- జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యాస రచన, వకృత్వ పోటీల్లో ప్రతిభకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
- స్పేస్, సైన్స్ క్లబ్‌లో నమోదై ఉంటే 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
- గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
- ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
➺ ఎంపికైతే ?
- విద్యార్థితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు.
- దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
- స్పేస్ సెంటర్లకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు.
- శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చలు, ప్రయోగశాలల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకేట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 23 మార్చి 2025
0 Comments