What is Lunar Eclipe ? What is Solar Eclipe ?
General Science Gk in Telugu
సూర్య, చంద్ర గ్రహణాలు అంటే ఏమిటీ ?
సూర్యుడు, చంద్రుడు, భూమి మూడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు ఏర్పడే వాటిని గ్రహణాలు అంటారు. ఇవి ప్రధాన రెండు రకాలుగా ఏర్పడుతాయి.
1. సూర్య గ్రహణం :
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని ‘‘సూర్య గ్రహణం ’’ అంటారు. ఈ గ్రహణం చంద్రుడి నీడలోకి భూమి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యడు, చంద్రుడు భూమికి ఒకేవైపున కనిపిస్తారు. అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కానీ ప్రతి అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడదు.
2. చంద్ర గ్రహణం :
సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని ‘‘చంద్ర గ్రహణం’’ అంటారు. భూమి యొక్క నీడలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు భూమికి ఇరువైపుల సూర్యడు, చంద్రుడు కనిపిస్తారు. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడదు.
0 Comments