రూపాయి గురించి ఆసక్తికర విషయాలు .. !
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నాణేలు, కాగితం నోట్లను కరెన్సీ అంటారు. భారతదేశంలో 1957 వరకు రూపాయి, అణా, పైసల రూపంలో కరెన్సీ అందుబాటులో ఉండేది. 01 ఏప్రిల్ 1957 నుండి దశాంశ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1, 2, 5, 20, 50, 100, 200, 500 రూపాయల కరెన్సీ చలామణిలో ఉన్నాయి. ప్రతి కరెన్సీ నోటుపై భారతదేశంలోని 17 భాషలను ముద్రిస్తారు. ప్రపంచ దేశాలలో అమెరికా-డాలర్, బ్రిటన్-పౌండ్, ఐరోపా సమాఖ్య - యూరో, జపాన్-యెన్‌లకు మాత్రమే కరెన్సీ చిహ్నం ఉండేది. 15 జూలై 2010 రూపాయి ప్రత్యేక ₹ చిహ్నానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూపాయి ₹ చిహ్నాన్ని డి.విజయ్‌కుమార్ రూపొందించాడు. భారత కరెన్సీని ₹ చిహ్నంతో సూచిస్తారు.
రూపాయి కరెన్సీ చలామణిలో ఉన్న దేశాలు
- మాల్దీవులు
- శ్రీలంక
- సీషెల్స్
- ఇండోనేషియా
- నేపాల్
- పాకిస్థాన్
- మారిషస్
0 Comments