Human brain | General Science
మానవ మెదడు
మెదడును అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘‘ప్రినాలజీ’’ అంటారు. నవజాత శిశువులో మొదడు యొక్క బరువు దాదాపు 300 నుండి 400 గ్రాముల వరకు ఉంటుంది. వయోజనులలో ఇది సుమారు 1350 నుండి 400 గ్రాముల వరకు ఉంటుంది. అదే పురుషులో మాత్రం 1375 గ్రాములు, స్త్రీలలో అయితే 1275 గ్రాముల బరువు ఉంటుంది. మానవ మెదడులో 75 శాతానికిపైగా నీటితో కూడి ఉంటుంది.
నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం నాడీకణం (న్యూరాన్). మెదడు పనితీరుకు మూలం న్యూరాన్. మెదడు కణాల్లో న్యూరాన్లు 10శాతం ఉంటాయి. మిగతా 90 శాతం గ్లియల్ కణాలు ఉంటాయి. ఈ గ్లియల్ కణాలు మెదడుకు పోషక పదార్థాలను అందించడంతో పాటు మెదడును శుభ్రం చేస్తాయి. మానవ మెదడులో దాదాపు 8600 కోట్ల న్యూరాన్(నాడీకణాలు)లు ఉన్నాయి.
జంతువులలో పరిశీలిస్తే అత్యంత బరువైన మెదడు తిమింగలంలో (8 కిలోలు) ఉంటుంది.మానవ మెదడు శరీరంలోని మొత్తతం శక్తిలో 20 శాతం, ఆక్సీజన్‌లో 20 శాతం, గ్లూకోజ్‌లో 25 శాతాన్ని వినియోగించుకొని మానవ శరీర మొత్తం బరువులో 2శాతం మాత్రమే ఉంటుంది.
0 Comments