PM GOBARdhan scheme | ప్రధానమంత్రి గోబర్ధన్‌ పథకం | Indian Schemes in Telugu

GOBARdhan scheme in telugu

GOBARdhan scheme in Telugu | Indian Schemes in Telugu 

ప్రధానమంత్రి గోబర్ధన్‌ పథకం

పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, ఇతర సేంద్రీయ, జీవవిచ్ఛిన్నం చెందే పదార్థాలను బయోగ్యాస్‌, సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గోబర్ధన్‌ పథకం (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రిసోర్సెస్‌ ధన్‌) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో ‘‘బయోగ్యాస్‌, కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తారు. వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా  వాహకాలు, కాలుష్యం వల్ల కలిగే వ్యాధులను తగ్గించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. 

➺ పథకం పేరు :

  • గోబర్ధన్‌ పథకం (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రిసోర్సెస్‌ ధన్‌)

డిపార్ట్‌మెంట్‌ :

  • జలశక్తి మంత్రిత్వ శాఖ

ముఖ్యమైన లక్ష్యాలు :

  • సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సంపద మరియు శక్తిని ఉత్పత్తి చేయడం
  • ఇంధన భద్రత కల్పించడం
  • వాహకాలు, కాలుష్యం వల్ల కలిగే వ్యాధులను తగ్గించడం
  • గ్రామీణ ఉపాధిని సృష్టించడంతో పాటు ఆరోగాన్ని మెరుగుపరచడం
  • పేడ మరియు ఇతర వ్యర్థాలను కేవలం వ్యర్థంగా కాకుండా ఆదాయ వనరుగా మలుచుకునేందుకు రైతులను ప్రోత్సహించడం
  • 2023-24 నాటికి దేశవ్యాప్తంగా 198 ప్లాంట్ల ఏర్పాటు

రిజిస్ట్రేషన్‌ :

బయోగ్యాస్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలనుకునే వారు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments