Pradhan Mantri Ujjwala Yojana Scheme | Indian Schemes in Telugu
ప్రధానమంత్రి ఉజ్వల యోజన
దేశంలోని పేదలందరికి స్వచ్ఛమైన వంట ఇందనం అందించే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన ’ అనే పథకాన్ని 1 మే 2016న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలోని నిరుపేదలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు ఉచిత సిలిండర్, గ్యాస్ స్టవ్ అందిస్తున్నారు. దేశంలోని 18 సంవత్సరాలు నిండిన ఏ మహిళ అయిన ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు.
పేద, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వంట చెరకు, బొగ్గు, పిడకలు వాడటం వల్ల వాయుకాలుష్యంతో పెరగడంతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా వంటచెఱుకు కోసం చెట్లను నరకడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. వంటచెఱుకును మండించడం వల్ల శ్వాసకోశ, కంటి వ్యాధులు సంభవిస్తాయి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదలందరికి ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నారు.
➺ ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఎవరు అర్హులు ?
- తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి
- 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో 1 లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించరాదు
- ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఇప్పటివరకు ఉండరాదు
➺ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఏం పొందవచ్చు ?
- ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు సిలిండర్
- ఉచితంగా గ్యాస్ స్టవ్
➺ ఈ పథకంలో ఏయే చమురు కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి ?
- ఏవోసీఎల్ (IOCL)
- బీపీసీఎల్(BPCL)
- హెపిసీఎల్(HPCL)
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- రేషన్‌కార్డు
- ఆధార్‌కార్డు
- బ్యాంక్ ఖాతా
0 Comments