South America Continent | దక్షిణ అమెరికా ఖండం | World Gk | World Geography - telugutechbadi

South America Continent

South America Continent | World Geography | General Knowledge in Telugu

 దక్షిణ అమెరికా ఖండం

దక్షిణ అమెరికా  దట్టమైన అడవులకు పెట్టింది పేరు. ఖండాలన్నింటిలో 4వ అతిపెద్ద ఖండం. ఎన్నో రకాల పక్షులు నెలవై ఉన్నందున దీనిని పక్షిఖండం అని కూడా అంటారు. ఈ ఖండం త్రిభుజాకారాన్ని పోలిఉంటుంది. 17.81 మిలియన్‌ చ.కిలోమీటర్ల భూభాగంతో విస్తరించింది. ఈ ఖండం 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు మరియు 35 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 81 డిగ్రీల పశ్చిమ రేశాంశాల మధ్య విస్తరించి ఉంది. ఈ ఖండం ఉత్తర భాగం నుండి భూమధ్యరేఖ వెళుతుంది. మధ్యభాగం నుండి మకరరేఖ వెళుతుంది.

➺ సరిహద్దులు :

ఉత్తరం - పనామా కాలువ, కరేబియన్‌ సముద్రం
దక్షిణం - దక్షిణ మహా సముద్రం
తూర్పు - అట్లాంటిక్‌ మహా సముద్రం
పడమర - పసిఫిక్‌ మహా సముద్రం 

అటవీ సంపద :

ప్రపంచంలో అరుదుగా దొరికే దృడమైన కలప అమెజాన్‌ అడవుల్లో దొరుకుతుంది. రోజ్‌వుడ్‌ , మహాగని, రబ్బర్‌ వృక్షాలు దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్‌ అడవుల్లో లభిస్తాయి. బ్రెజిల్‌, బొలీవియా, అర్జెంటీనా , పరాగ్వే దేశాల్లో విస్తరించిన గడ్డిభూములను ‘‘కంపాలు’’ అని పిలుస్తారు. 


Also Read :


శీతోష్ణస్థితి :

ప్రపంచంలోని అతిపెద్ద నది అమెజాన్‌, ఎత్తయిన ముడత పర్వతాలు అయిన అండీస్‌ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలోనే ఉన్నాయి. అందువల్ల ఈ ఖండాన్ని సర్వోత్తముల ఖండం (ల్యాండ్‌ ఆఫ్‌ సూపర్‌లేటీవ్‌) అంటారు. ఈ ఖండంలో ఉష్టమండల శీతోష్ణస్థితి ఉంటుంది. అందువల్ల అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదు అవుతాయి. అమెజాన్‌ నదీ పరివాహక ప్రాంతంలో భూమధ్యరేఖ, అటకామా ప్రాంతంలో ఎడారి ప్రాంత, చిలీ ప్రాంతంలో మధ్యదరా శీతోష్ణస్థితి ఉంటుంది. దక్షిణ చిలీలో సంవత్సరం పొడవునా వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ఖండంలో సూర్యుడిని అనుసరించి వర్షం పడుతుంది.

వ్యవసాయం :

దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానంగా మొక్కజొన్న, గోధుమ, కాఫీ, చెరకు, పత్తి పంటలు పండిస్తారు.కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్‌ దేశంను ‘‘ప్రపంచ కాఫీ కప్పు’’ అంటారు.  

భౌగోళిక స్వరూపం :

దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న సన్నని తీర మైదానంలో చేపల వేల ప్రధాన వృత్తిగా ఉంది. పశ్చిమ తీరానికి సమాంతరంగా అండీస్‌ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తయిన పర్వత శిఖరం అకాన్‌గువా అండీస్‌ పర్వతాల్లోనే ఉంది. మధ్యమైదానాలు అండీస్‌ పర్వతాలు, తూర్పు మెట్టభూములకు మధ్య ఉంటాయి. దక్షిణ అమెరికా మధ్య మైదానాలలో ఒరినాకో, అమెజాన్‌, పరానా, ఉరుగ్వే నదులు ప్రవహిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద నది అయిన అమెజాన్‌  అండీస్‌ పర్వతాల్లో పుట్టి, అట్లాంటిక్‌ మహాసముద్రంలో కలుస్తుంది. పరానా నది కారణంగా ఇక్వాజో జలపాతం ఏర్పడుతుంది. వెనుజులాలోని చురణ్‌ నది వల్ల ఏర్పడే ‘‘ఏంజెల్స్‌’’ జలపాతం (799 మీటర్లు) ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం.



Also Read :



Post a Comment

0 Comments