TS RGUKT IIIT Basara Notification 2025-2026 for B.Tech admisions apply online at rgukt.ac.in
ఎస్.ఎస్.సి (10వ తరగతి) లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్మల్ జిల్లా బాసరలోని Rajiv Gandhi University of Knowledge Technologies-Basar (RGUKT) లో బిటెక్‌లో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాసరలోని ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక సీటు దక్కించుకోలేకపోతారు. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ధరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఆన్‌లైన్ ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి వివరంగా కింద ఇవ్వడం జరిగింది.
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) బాసర ట్రిపుల్‌ఐటీలో 6 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది. 2025-26 సంవత్సరంలో మొత్తం 1500 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు ఎస్.ఎస్.సి(10వ తరగతి) రెగ్యులర్ విధానంలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
మహబూబ్‌నగర్‌లో కొత్త RGUKT IIIT క్యాంపస్‌కు అనుమతి లభించింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి అక్కడ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కొత్త క్యాంపస్‌లో మూడు కొత్త కోర్సులు అందుబాటులో తీసుకురానున్నారు. CSC, AI & ML, DATA SCIENCE కోర్సులు ప్రారంభం కానున్నాయి. RGUKT బాసర ఆధ్వర్యంలోనే మహబూబ్‌నగర్ క్యాంపస్ నడవనుంది.
➠ విద్యార్హత :
మొదటి ప్రయత్నంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
➠ క్యాంపస్ లు :
- బాసర (1500 Seats)
- మహబూబ్ నగర్ (180 Seats)
➠ ఎంపిక పద్దతి :
- 10వ తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు.
- 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు.
- ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను ఎంపిక చేస్తారు.
- 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
- తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు.
Also Read :
➠ విద్యా సౌకర్యాలు :
విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం, యూనిఫారం, షూస్, ల్యాప్‌టాప్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
➠ ధరఖాస్తు ఫీజు :
- ఓసీ, బీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 450/- రూపాయలు
➠ ధరఖాస్తు విధానం :
- ధరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
➠ ఫీజు వివరాలు :
- సెమిస్టర్ కలుపుకొని సంవత్సర ఫీజు 36,000 రూపాయలు చెల్లించాలి (ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నవారు చెల్లించాల్సిన అవసరం లేదు)
- తెలంగాణకు సంబందించిన ఎన్నారైల పిల్లలు 1,36,000 రూపాయలు చెల్లించాలి
- మిగతా ఎన్నారైలు అయితే 3,00,000 రూపాయలు చెల్లించాలి.
- ప్రవేశ సమయంలో ఆరోగ్యభీమా ఇతరాలకు 3,500 రూపాయలు (ఎస్సీ/ఎస్టీలు అయితే 3వేలు) చెల్లించాలి.
➠ కోర్సు కాలపరిమితి :
ఇది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు. 6 సంవత్సరాల కోర్సును 2 రకాలుగా విభజిస్తారు
1) ప్రీ యూనివర్సీటి కోర్సు (2 సంవత్సరాలు)
- గణితం
- భౌతిక శాస్త్రం
- కెమిస్ట్రీ
- ఇంగ్లీష్
- తెలుగు/సంస్కృతం (తెలుగు భాషగా సెకండ్ లాంగ్వేజ్‌ని అభ్యసించని తెలుగుయేతర విద్యార్థులకు సంస్కృతం అందించబడుతుంది)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- పర్యావరణ శాస్త్రం
2) బీ.టెక్ (4 సంవత్సరాలు)
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్
Basara IIIT ముఖ్యమైన తేదీలు | |
---|---|
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 31 మే 2025 |
ధరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది | 21 జూన్ 2025 |
హార్ట్ కాపీలు స్వీకరణ తేది | 25 జూన్ 2025 |
ఎంపిక విద్యార్థుల ప్రకటన తేది | 04 జులై 2025 |
కౌన్సిలింగ్ తేదీ | 7 జూలై 2025 నుండి |
ఆన్‌లైన్ అప్లై కొరకు | Click Here |
Basara IIIT | |
---|---|
కేటగిరీ | అడ్మిషన్ |
జిల్లా | నిర్మల్ |
ప్రదేశం | బాసర ట్రిపుల్ ఐటీ |
విద్యా సంస్థ | రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జియూకేటీ) బాసర ట్రిపుల్ ఐటి |
అర్హత | 10వ తరగతి (ఎస్.ఎస్.సి) |
ఎంపిక విధానం | 10వ తరగతి జీపిఏ ఆధారంగా |
ఎంపిక ప్రక్రియ | ఆన్‌లైన్ ద్వారా |
ఫీజు | 500 (ఓసీ, బీసీ), 450 (ఎస్సీ/ఎస్టీ), 1500 (అదర్స్) |
ధరఖాస్తులు ప్రారంభం | 31 మే 2025 |
ధరఖాస్తులు ముగింపు | 21 జూన్ 2025 |
కౌన్సిలింగ్ | 7 జూలై 2025 నుండి |
0 Comments