పాదరసం
పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించే లోహ మూలక పదార్థం.దీని యొక్క సంకేతము Hg, పరమాణు సంఖ్య 80. దీనిని సిన్నబార్ అనే ముడిపదార్థం నుండి గ్రహిస్తారు. పాదరసం వెండివలె మెరవడంతో దీనిని క్విక్ సిల్వర్ అని పిలుస్తారు. పాదరసం లోహాలతో చర్య జరపడం వల్ల అమాల్గమ్‌లు ఏర్పడుతాయి. ఇది Fe (ఇనుము)తో ఎటువంటి చర్య జరపదు. అందువల్ల పాదరసాన్ని ఇనుముతో చేసిన వస్తులలో రవాణా / నిల్వ చేయవచ్చు. పాదరసం ఉష్ణవాహకం మరియు విద్యుత్ వాహకం. పాదరస కాలుష్యం వల్ల ‘‘మినిమిటా’’ అనే వ్యాది సంక్రమిస్తుంది. ఈ వ్యాదిని మొదటగా జపాన్‌లో కనుగొన్నారు.
0 Comments