Red Blood Cells | ఎర్ర రక్త కణాలు | General Science in Telugu

Red Blood Cells |  ఎర్ర రక్త కణాలు | General Science in Telugu

 Importance of Red Blood Cells

 ఎర్ర రక్త కణాలు 

General Science in Telugu | General Knowledge in Telugu

మానవ శరీరంలో ప్రతి క్యూబిక్‌ మిల్లీ మీటరు రక్తంలో 4.5 నుండి 5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. మానవ శరీరంలో సుమారు 32 బిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాలు ఎముక మజ్జలో ఏర్పడడాన్ని ‘‘ఎరిత్రోపాయిసిస్‌’’ అంటారు. ఇవి ద్విపుటాకారంలో ఉంటాయి. అభివృద్ది చెందిన క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రం, ఇతర కణభాగాలు ఉండవు. ఎర్ర రక్తకణాలు అభివృద్ది చెందడానికి ఇనుము, విటమిన్‌ బి12, విటమిన్‌ బి9 ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఇవి లోపిస్తే ‘‘అనిమియా (రక్తహీనత)’’ ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాలు 120 రోజులు జీవించి ఉంటాయి. చివరికి ప్లీహంలో నశిస్తాయి. శరీరంలోని రక్త కణం మరియు ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌ను అన్ని కణజాలాలు మరియు అవయవాలకు పంపిణీ చేస్తాయి. మరియు ఉచ్ఛ్వాస కొకు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకెళతాయి. ఎర్ర రక్తకణాలు లేకుండా శరీర కణజాలాలు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందుకోవు.


Also Read :




Also Read :


Post a Comment

0 Comments