దాదాభాయ్ నౌరోజీ
Dadabhai Naoroji Biography in Telugu
భారతదేశ స్వాతంత్రం కొరకు ముందుండి పోరాడిన ముఖ్యమైన వ్యక్తుల్లో దాదాభాయ్ నౌరోజీ ఒకరు. విద్యావేత్త, రాజకీయవేత్త అయిన దాదాభాయ్ నౌరోజీ 4 సెప్టెంబర్ 1825న గుజరాత్ రాష్ట్రంలోని నవ్‌సారిలో జన్మించారు. బొంబాయి ప్రెసిడెన్సీలో మొట్టమొదటి రాజకీయ సంస్థగా పిలువబడే ‘‘బొంబాయి అసోసియేషన్’ స్థాపన కొరకు చురుకుగా పనిచేశారు. ఇది 26 అగస్టు 1852న ఏర్పాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పనిచేశారు. భారతీయుల సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి నౌరోజీ లండన్ కేంద్రంగా ‘‘ఈస్టిండియన్ అసోసియేషన్’’ 1865లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇది ‘బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్’ గా మార్చారు. నౌరోజీ కలకత్తా, లాహోర్ లలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2వ, 9వ, 22వ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఇంగ్లండ్‌లోని సెంట్రల్ ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుండి పార్లమెంట్‌లోని కామన్స్ సభకు ఎంపికైన తొలి భారతీయుడు దాదాభాయి నౌరోజీ. దాదాభాయి నౌరోజీ 1901లో ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించారు. దాదాభాయి నౌరోజీ 30 జూన్ 1917న తుదిశ్వాస విడిచారు.
0 Comments