అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Day of Yoga
యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి యేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నారు. యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాల్లో ఒక భాగంగా ఉండేది. యోగా ప్రతిరోజు చేయడం వల్ల శారీరక ఆరోగ్యం లభించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. యోగాసానాల వల్ల శ్వాస సంబంధ నియంత్రణ, నొప్పులు తగ్గడం, రక్తపోటు అదుపులో ఉండడం, నిద్ర సమస్యలు తొలగడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగ సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను విసృతంగా ప్రచారం చేయడం ‘‘ఇంటర్నేషనల్ యోగా డే’’ ముఖ్య లక్ష్యం.
‘‘యోగా’’అనేది సంస్కృత పదం. దీని అర్థం ‘చేరడం’ లేదా ‘ఏకం’. యోగా పితామహునిగా ‘పతంజలి మహర్జి’ని పేర్కొంటారు. యోగా డే 2025 నినాదం ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’.
0 Comments