పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో ఎంట్రన్స్ కొరకు
గేట్ - 2024 నోటిఫికేషన్ విడుదల
Admissions in Telugu || Jobs in Telugu
Gate 2026 : భారతదేశంలో ప్రఖ్యాతిపొందిన విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో ఎంట్రన్స్ కొరకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే Gate 2026 కొన్ని కంపెనీలలో ఉద్యోగాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన, కఠినమైన పరీక్ష గేట్. గేట్ ఎంట్రన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / ఫార్మసీ విభాగాల్లో పీజీల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా బీహెచ్‌ఈఎల్, గెయిల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీవోఏఎల్, ఎన్‌హెచ్‌ఏలు, ఎన్‌ఎండీసీ, ఓఎన్‌జీసీ, మహారత్న, నవరత్న వంటి ప్రసిద్ద కంపెనీలు కూడా గేట్ స్కోరు ప్రమాణికంగా తీసుకొని ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పిస్తాయి.
Gate 2026 ఎంట్రన్స్ టెస్ట్ వ్రాయలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హూమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
➠ ఎంట్రన్స్ టెస్టు :
- గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)
➠ విద్యార్హత :
- ఇంజనీరింగ్ / టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ / సైన్స్ / కామర్స్ / ఆర్ట్స్ / హూమానిటీస్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➠ పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మొత్తం 100 మార్కులకు 3 గంటల్లో నిర్వహిస్తారు.
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 25 ఆగస్టు 2025
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 సెప్టెంబర్ 2025
ఆలస్య రుసుముతో ధరఖాస్తులకు చివరి తేది : 06 నవంబర్ 2025

0 Comments