Bathukamma Festival | బతుకమ్మ | Telangana Gk in Telugu

bathukamma

  Bathukamma Festival  | బతుకమ్మ  

దసరా సంబరాల్లో భాగమైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకత తీసుకువచ్చింది.ఈ రంగుల పండుగకు చారిత్రక, పర్యావరణ, సామాజిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మెరిసే దుస్తులు మరియు ఆభరణాలు ధరించిన మహిళలు తంగేడు, గునుగు, చామంతి మరియు ఇతర పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను గ్రామం లేదా వీధి సమావేశ ప్రదేశానికి తీసుకువెళతారు. దసరాకు ముందు జరిగే పెద్ద బతుకమ్మ రోజున గౌరమ్మను పూజించి తగ్గరలో ఉన్న వాగులు,వంకలు,నీటి నిల్వ ప్రాంతాలలో నిమజ్జనం చేసి పిల్లపాపలతో సద్దన్నం ఆరగించి ఇంటికి తిరుగు ప్రయాణమవుతారు.  

సమావేశమైన బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, మహిళలు సమూహంగా పాటలు పాడతారు. పాటలు పురాణాలు, చరిత్ర మరియు నిర్దిష్ట ప్రాంతంలోని ఇటీవలి రాజకీయ మరియు సామాజిక పరిణామాలలో కూడా వాటి మూలాలను కలిగి ఉన్నాయి. సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది, ఇక్కడ గ్రామస్తులు సమీపంలోని ట్యాంకులు మరియు సరస్సులలో పూల స్టాక్‌లను నిమజ్జనం చేస్తారు. 

ఎంగిలిపూల బతుకమ్మ 

మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం, పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగక ముందు ఆయా పుష్పాలన్నీ  వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు.

అటుకుల బతుకమ్మ

రెండో రోజు అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరు ఆటపాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 

ముద్దపప్పు బతుకమ్మ

3వ రోజున ముద్దపప్పు బతుకమ్మగా జరుపుతారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యాన్ని తయారు చేసి ఆరగిస్తారు. 

నానబియ్యం బతుకమ్మ

4వ రోజున నాన బియ్యం బతుకమ్మను జరపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా నానాబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్ల బతుకమ్మ

5వ రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను తయారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. 

అలిగిన బతుకమ్మ

6వ రోజున అలిగిన బతుకమ్మగా పరిగణిస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. 

వేపకాయ బతుకమ్మ

7వ రోజున వేపకాయ బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. 

వెన్నెముద్దల బతుకమ్మ

8వ రోజున వెన్నెముద్దల బతుకమ్మ గా జరుపుకుంటారు. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు . అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ

బతుకమ్మ నవరాత్రి ఉత్తవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈ రోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని ఆరగిస్తారు. 

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments