తెలంగాణలో రెండు కొత్త పథకాలు ప్రారంభం
మైనార్టీలకు ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’’, ‘‘రేవంతన్న కా సహారా’’ పథకాలకు శ్రీకారం చుట్టారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ పథకం :
- ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన
- రేవంతన్న కా సహారా
➺ రాష్ట్రం :
- తెలంగాణ
➺ ఆర్థిక సహాయం :
- ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు 50 వేల రూపాయలు అందిస్తారు.
- రేవంతన్న కా సహారా పథకం కింద ఫఖీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు అందిస్తారు. దాదాపు 500 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష గ్రాంటు లభిస్తుంది.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 06 అక్టోబర్ 2025
For Online Apply

0 Comments