హైదరాబాద్ విలీన దినోత్సవం
1947 అగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా దక్షిణాదిలోని హైదరాబాద్ సంస్థానం 13 నెలల కాలంపాటు నిజాం పరిపాలనలోనే ఉంది. ఈ 13 నెలల కాలంలో ఇక్కడ అనేక అరాచకాలు, అకృత్యాలు జరిగాయి. మానవ హక్కుల ఉల్లంఘన జరిగి, మతతత్వం ఉచ్ఛ స్థితికి చేరింది. రజాకార్లు అడ్డూ అదుపు లేకుండా తమ అకృత్యాలను కొనసాగించడంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేని క్లిష్ట పరిస్థితులలో శాంతి నెలకొల్పే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ‘‘ఆపరేషన్ పోలో’’ పేరుతో సైనిక చర్య చేపట్టింది. దీంతో 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది.
హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి చేసిన ‘‘ఆపరేషన్ పోలో 13 సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ 1948 వరకు కొనసాగింది.
Also Read :
Also Read :
0 Comments