IIT JAM 2026 : Application Form ,Eligibility, Online Apply, Exam Pattern
ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్ కొరకు ‘‘జామ్’’ అడ్మిషన్ టెస్టు
ఐఐటీల్లో అడ్మిషన్ పొందాలనే కలను నిజం చేసుకోవాలంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్) రాయాల్సి ఉంటుంది. ఈ జామ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు.
జామ్‌తో దేశంలోని 22 ఐఐటీల్లో పీజీ సీట్లను భర్తీ చేస్తారు. ఐఐటీలతో పాటు ఐఐఎస్సీ, నీట్‌లు, ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌ఈఆర్ పుణె, భోపాల్ క్యాంపస్‌లు, డీఐఏటీ, ఐఐపీఈ, జేఎన్‌సీఏ, ఎస్‌ఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ తదితర టాప్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ అడ్మిషన్ పొందవచ్చు.
➺ ప్రవేశ పరీక్ష :
- జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్)
➺ కోర్సులు :
- కెమిస్ట్రీ
- ఎకనామిక్స్
- జియాలజీ
- మ్యాథమెటికల్
- స్టాటిస్టిక్స్
- మ్యాథమెటిక్స్
- ఫిజిక్స్‌లో పీజీ
- పిహెచ్‌డీ
➺ విద్యార్హత :
- సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించాలి
- డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ వయస్సు :
- గరిష్ట వయోపరిమితి లేదు
➺ పరీక్షా విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మొత్తం ఏడు అనగా బయోటెక్నాలజీ, కెమిస్ట్రి, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుండి ప్రశ్నలు అడుగుతారు. మూడు గంటల్లో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతి పేపర్ నుండి 60 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని ఏ, బీ, సీ మూడు సెక్షన్‌లుగా విభజిస్తారు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 12 అక్టోబర్ 2025
జామ్ పరీక్ష తేది :15 ఫిబ్రవరి 2026

0 Comments