Jawahar Navodaya Vidyalaya Admissions || Navodaya 9th Class Lateral Entry Admissions
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. సెలక్షన్ టెస్టు ద్వారా ప్రవేశాల కల్పిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 650 స్కూల్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఉన్నాయి. నవోదయ విద్యాయాల్లో కో-ఎడ్యూకేషన్ రెసిడెన్షియల్ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచిరకమైన భోజనం, యూనిఫారమ్, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఇందులో మెథమేటిక్స్, సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లీష్‌మీడియంలో, సోషల్ సైన్స్‌ను హిందీ/ఇంగ్లీష్ మీడియంలో భోదిస్తారు. ఇందులోని విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం సీబీఎస్‌సీ నిర్వహించే వార్షిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది.
జవహర్
నవోదయ విద్యాలయాల్లోని లెటరల్ ఎంట్రి కొరకు 8వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవాలి.
➯ స్కూల్ :
- జవహర్ నవోద విద్యాలయ
➯ తరగతి :
- 9వ తరగతి
➯ వయస్సు :
- 01 మే 2011 నుండి 31 జూలై 2013 మధ్య జన్మించి ఉండాలి
➯ ఎంపిక విధానం :
- అడ్మిషన్ టెస్టు ద్వారా
➯ పరీక్ష విధానం :
- మొత్తం 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో 100 ప్రశ్నలకు 2:30 గంటల్లో సమాధానాలు ఇవ్వాలి.
- ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్‌ల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ / హిందీలో ఉంటుంది.
➯ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 07 అక్టోబర్ 2025
Apply Online

0 Comments