కాలేయం | Liver | General Science in Telugu | Science Gk in Telugu
మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది మానవ శరీరంలో భిన్నమైన విధులను నిర్వహిస్తుంది. ఇది శరీరంలో అతిపెద్ద గ్రంథి. దీని యొక్క బరువు సుమారు 1560 గ్రాముల వరకు ఉంటుంది. ఈ అవయవం విష నిర్మూలన అవయవంగా విధులు నిర్వహిస్తుంది. కాలేయం ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. ఫెబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ , స్కంధన కారకాలు హెపారిన్ అనే రక్తస్కంధన నివారిణి కాలేయంతోనే ఉత్పత్తి అవుతాయి. కాలేయంలో మూత్రంలో విసర్జించే యూరియా ఉత్పత్తి అవుతుంది. గ్లూకోనియోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనోలైసిస్ వంటివి కాలేయంలోనే జరుగుతాయి. ఎ, డి, ఎఫ్, కె వంటి విటమినులు కాలేయంలో నిల్వ ఉంటాయి. కాలేయంలో నాలుగు లంబికలు ఉంటాయి. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘‘హెపటాలజీ’ అంటారు. కాలేయంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ‘జాండిస్’ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయం నుండి వచ్చే రక్తం, రక్తకణాల వల్ల పిండాభివృద్ది జరుగుతుంది.
0 Comments