నీల్స్‌బోర్‌ | Niels Bohr Biography in Telugu |Bohr Model Biography in Telugu

Niels Bohr Biography in Telugu

Niels Bohr Biography in Telugu | Bohr Bodel

 నీల్స్‌బోర్‌ 

నీల్స్‌బోర్‌ ఒక భౌతిక శాస్త్రవేత్త. ఇతను డెన్మార్క్‌ దేశానికి చెందిన వాడు. నీల్స్‌బోర్‌ 07 అక్టోబర్‌ 1885 రోజున డెన్మార్క్‌లోని కోపేన్‌హగన్‌లో జన్మించాడు. పరమాణు నిర్మాణం మరియు క్వాంటమ్‌ సిద్దాంతాల గురించి వివరించిన వ్యక్తి నీల్స్‌ బోర్‌. ఇతని అసలు పేరు నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌. ఇతను కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే మార్గాలను కక్ష్యలుగా (ఆర్పిట్స్‌) ఉంటాయని నిరూపించాడు. దీనినే ‘‘బోర్‌ నమూనా’’ అంటారు. వీటిని శక్తిస్థాయిలు అని పేరు పెట్టారు. అణు కేంద్రం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్‌లు ఎక్కువ శక్తి గల కక్ష్య నుండి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని విశ్లేశించాడు.పరమాణు నిర్మాణంపై విశేష కృషి చేసినందుకు 1922లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తొలి అణుబాంబును తయారు చేయాలనుకున్న ప్రాజేక్టులో మెంబర్‌గా ఉన్నాడు. ఈయన 18 నవంబర్‌ 1962న కోపెన్‌హగన్‌లో మరణించినాడు. 

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments