మహాసముద్రాలు
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భూమిపై ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూ స్వరూపాలుగా పేర్కొంటారు. అతిపెద్దదైన జలభాగాలనే మహాసమద్రాలుగా పిలుస్తారు. భూమిమీద గల నీటిభాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసమద్రాలుగా 1) పసిఫిక్ మహాసముద్రం 2) అట్లాంటిక్ మహాసముద్రం 3) హిందూ మహాసముద్రం 4) దక్షిణ మహాసముద్రం (అంటార్కిటిక్) 5) ఆర్కిటిక్ మహాసముద్రాలుగా విభజించడం జరిగింది.
సాధారణంగా సముద్రం, మహాసముద్రాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అని అంటారు. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజిస్తారు.
సముద్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "ఓషనోగ్రఫీ" అంటారు. ఈ పదం గ్రీకు నుండి స్వీకరించబడిరది. మహాసముద్రాల యొక్క లోతును ఎకో సౌండింగ్ లేదా లూకాస్ సౌండింగ్ పద్దతుల ద్వారా కొలుస్తారు. మహా సముద్రాల లోతును పాంథమ్స్లో, దూరాన్ని నాటికల్ మైల్స్లో, వేగాన్ని నాట్లలో కొలుస్తారు.
మహాసముద్రాలు అవి విస్తరించి ఉన్న ప్రాంతాలు
➺ పసిఫిక్ మహాసముద్రం :
పడమర - ఆసియా, ఆస్ట్రేలియా
తూర్పు - ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య
➺ అట్లాంటిక్ మహాసముద్రం :
పశ్చిమం - ఉత్తర, దక్షిణ అమెరికా
తూర్పు - యూరప్, ఆఫ్రికా మధ్య
➺ హిందూ మహాసముద్రం :
ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా
➺ ఆర్కిటిక్ మహాసముద్రం :
అమెరికా, యూరప్, ఆసియా తీరాలను తాకుతూ అర్కిటిక్ వలయం వరకు విస్తరించి ఉంది.
➺ అంటార్కిటిక్ మహాసముద్రం :
అంటార్కిటిక్ ఖండం
Social Plugin