భారతదేశంలో వాయు రవాణా (Air Transport in India)
| విభాగం | వివరణ |
|---|---|
| మొదటి ఎయిర్‌మెయిల్ సర్వీస్ | 1911లో అలహాబాద్ – నైనిటాల్ మధ్య ప్రారంభమైంది (10 కి.మీ దూరం). హెన్రీ ఫికిట్ నడిపారు. |
| వ్యవస్థీకృత విమాన రవాణా ప్రారంభం | 1920లో టాటా సన్స్ సంస్థ కొన్ని ఎయిర్ డ్రోమ్‌లను ప్రారంభించింది. |
| మొదటి విమాన సర్వీస్ (జె.ఆర్.డి. టాటా) | 1932లో కరాచీ – ముంబై మధ్య విమానం నడిపారు. ఆయన్ని భారత విమానయాన పితామహునిగా పిలుస్తారు. |
| వాయు రవాణా జాతీకరణ | 1953లో రెండు ఎయిర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు – 1) ఎయిర్ ఇండియా (విదేశీ సర్వీసుల కోసం) 2) ఇండియన్ ఎయిర్‌లైన్స్ (స్వదేశీ సర్వీసుల కోసం) |
| వాయుదూత్ సర్వీసులు | 1981లో ప్రారంభించారు; 1993లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు. |
| ఓపెన్ స్కై పాలసీ | 1990 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు; ప్రైవేటు వైమానిక సంస్థలను అనుమతించారు. |
| ఎయిర్ ఇండియా |
ఖండాంతర సర్వీసులు నడుపుతుంది. మస్కట్ – ‘మహారాజా’. 90 దేశాలతో ఒప్పందాలు. ప్రధాన సర్వీసులు: కెనడా, అమెరికా, యూరప్, రష్యా, గల్ఫ్, తూర్పు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. గల్ఫ్ రూట్ లాభదాయకం. ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు – కేరళలో. ఎక్కువ విమానాశ్రయాలు – గుజరాత్‌లో. |
| ఇండియన్ ఎయిర్‌లైన్స్ |
దేశీయ మరియు 19 పొరుగు దేశాలకు సర్వీసులు. 2005లో ‘ఇండియన్’గా పేరు మార్చారు. మస్కట్ – కోణార్క్ సూర్య దేవాలయం రథచక్రం. సాధారణ విమానాశ్రయాలు – నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్వహణ. |
| పవన్ హన్స్ లిమిటెడ్ |
స్థాపన – 15 అక్టోబర్ 1985, ఢిల్లీ. మొదట పెట్రోలియం స్థావరాలకు సేవలు. తర్వాత కొండ ప్రాంతాలు, ఎన్టీపీసీ, గెయిల్, బీఎస్‌ఎఫ్ లకు విస్తరించారు. |
| ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ |
స్థానం – పుర్‌సత్‌గంజ్, ఉత్తర ప్రదేశ్. పైలట్ల శిక్షణ. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో. |
| హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) | బెంగళూరులో ఉంది; విమానాల తయారీ, రిపేర్ల నిర్వహణ. |
| ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) |
1 ఏప్రిల్ 1995న నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీల విలీనంతో ఏర్పాటు చేశారు. కింద మూడు విభాగాలు పనిచేస్తున్నాయి: 1) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డివిజన్ 2) నేషనల్ ఎయిర్‌పోర్ట్ డివిజన్ 3) ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ |
| ఓపెన్ స్కై పాలసీ వల్ల ఏర్పడిన ప్రైవేటు ఎయిర్‌వేస్ |
1) జెట్ ఎయిర్‌వేస్ 2) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 3) ఇండిగో ఎయిర్‌వేస్ 4) స్పైస్ జెట్ 5) జెట్‌లైట్ 6) గో ఎయిర్‌వేస్ 7) పారామౌంట్ ఎయిర్‌వేస్ 8) దక్కన్ ఏవియేషన్ |

0 Comments