Mineral Resources of India GK Questions and Answers for Competitive Exams | Indian Geography MCQ Questions with Answers

Mineral Resources of India GK Questions

Mineral Resources of India – Important GK Questions for UPSC, SSC, and State Exams | Indian Geography MCQ Quiz Questions 

Question No. 1
వజ్రాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?

A) భారత్‌
B) రష్యా
C) బోట్స్‌వానా
D) కెనడా

Answer : B) రష్యా



Question No. 2
భారతదేశంలో వజ్రాల నిల్వల విషయంలో ప్రథమ స్థానం దక్కిన రాష్ట్రం ఏది?

A) మధ్యప్రదేశ్
B) ‌ ఆంధ్రప్రదేశ్‌
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

Answer : A) మధ్యప్రదేశ్‌



Question No. 3
వజ్రాలు ప్రధానంగా ఏ రకమైన శిలల్లో లభిస్తాయి?

A) లేటరైట్‌ శిలల్లో
B) గ్రానైట్‌ శిలల్లో
C) కింబర్లైట్‌ శిలల్లో
D) సున్నపురాయి శిలల్లో

Answer : C) కింబర్లైట్‌ శిలల్లో



Question No. 4
మైకా ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?

A) చైనా
B) రష్యా
C) అమెరికా
D) భారత్‌

Answer : D) భారత్‌



Question No. 5
మైకాను ఎలక్ట్రికల్‌ పరిశ్రమల్లో ఏ అవసరానికి వాడుతారు?

A) కాంతి ప్రతిఫలనం కోసం
B) వేడి నిరోధకంగా
C) ఇన్సులేటర్‌గా
D) రసాయన పదార్థంగా

Answer : C) ఇన్సులేటర్‌గా



Question No. 6
మైకా ఏ రూపాల్లో లభ్యమవుతుంది?

A) హైడ్రోసిలికేట్ల రూపంలో
B)సిలికేట్ల రూపంలో
C) కార్బోనేట్ల రూపంలో
D) సల్ఫేట్ల రూపంలో

Answer : A) హైడ్రోసిలికేట్ల రూపంలో



Question No. 7
మాస్కోవైట్‌, ప్లోగోవైట్‌, బయొటైట్‌ అనే మూడు రూపాలు ఏ ఖనిజానికి చెందినవి?

A) వజ్రం
B) డొలమైట్‌
C) గ్రాఫైట్‌
D) మైకా

Answer : D) మైకా



Question No. 8
బెరైటీస్‌ నిల్వలలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?

A) అమెరికా
B) చైనా
C) భారత్‌
D) ఆస్ట్రేలియా

Answer : C) భారత్‌



Question No. 9
బెరైటీస్‌ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలు ఏవి?

A) మంగంపేట‌, అనంతరాజుపేట‌
B) నంద్యాల‌, ప్రొద్దుటూరు
C) కడప‌, తిరుపతి
D) విజయవాడ‌, నెల్లూరు

Answer : A) మంగంపేట‌, అనంతరాజుపేట‌



Question No. 10
బెరైటీస్‌ ఏ రసాయన పదార్థం రూపంలో లభిస్తుంది?

A) ‌ కేల్షియం కార్బోనేట్
B) ‌ బెరియం ఆక్సైడ్
C) సోడియం క్లోరైడ్‌
D) పొటాషియం సల్ఫేట్‌

Answer : B) బెరియం ఆక్సైడ్‌



Question No. 11
ఆస్‌బెస్టాస్‌ ప్రధానంగా ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు?

A) గ్లాస్‌ పరిశ్రమల్లో
B) ఎరువుల పరిశ్రమల్లో
C) వజ్రాల పొలిష్‌లో
D) సిమెంట్‌ పరిశ్రమల్లో

Answer : D) సిమెంట్‌ పరిశ్రమల్లో



Question No. 12
ఆస్‌బెస్టాస్‌ గనుల్లో పనిచేసే కార్మికులు ఏ వ్యాధికి గురవుతారు?

A) సిలికోసిస్‌
B) ట్యూబర్క్యులోసిస్‌
C) ఆస్‌బెస్టోసిస్‌
D) మలేరియా

Answer : C) ఆస్‌బెస్టోసిస్‌



Question No. 13
ఆస్‌బెస్టాస్‌ ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు ఏవి?

A) రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌
B) మధ్యప్రదేశ్‌, ఒడిశా
C) జార్ఖండ్‌, తమిళనాడు
D) కర్ణాటక‌, గుజరాత్‌

Answer : A) రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌



Question No. 14
సున్నపురాయి ప్రధానంగా ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు?

A) ఎరువుల పరిశ్రమల్లో
B) సిమెంట్‌ పరిశ్రమల్లో
C) గ్లాస్‌ పరిశ్రమల్లో
D) రబ్బర్‌ పరిశ్రమల్లో

Answer : B) సిమెంట్‌ పరిశ్రమల్లో



Question No. 15
సున్నపురాయి ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది?

A) కర్ణాటక‌
B) ‌ రాజస్థాన్‌
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా

Answer : C) మధ్యప్రదేశ్‌



Question No. 16
డొలమైట్‌ను ప్రధానంగా ఏ పరిశ్రమలో వాడుతారు?

A) స్టీల్‌ పరిశ్రమలో
B) ఎరువుల పరిశ్రమలో
C) సిమెంట్‌ పరిశ్రమలో
D) గ్లాస్‌ పరిశ్రమలో

Answer : A) స్టీల్‌ పరిశ్రమలో



Question No. 17
డొలమైట్‌ ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు ఏవి?

A) ఛత్తిస్‌ఘడ్‌, ఒడిశా
B) కర్ణాటక‌, గుజరాత్‌
C) మహారాష్ట్ర‌, రాజస్థాన్‌
D) తమిళనాడు‌, ఆంధ్రప్రదేశ్‌

Answer : A) ఛత్తిస్‌ఘడ్‌, ఒడిశా



Question No. 18
డొలమైట్‌లో ఏ మూలకాలు ఉంటాయి?

A) కార్బన్‌, నైట్రోజన్‌
B) సోడియం, క్లోరిన్‌
C) పొటాషియం, గంధకం
D) కాల్షియం, మెగ్నీషియం

Answer : D) కాల్షియం, మెగ్నీషియం



Question No. 19
గ్రాఫైట్‌ ప్రధానంగా ఏ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు?

A) గాజు వస్తువులు
B) పెన్సిళ్లు మరియు బ్యాటరీలు
C) ఫైబర్‌ మరియు ప్లాస్టిక్‌
D) సిమెంట్‌ మరియు ఇనుము

Answer : B) పెన్సిళ్లు మరియు బ్యాటరీలు



Question No. 20
గ్రాఫైట్‌ నిల్వల్లో ప్రపంచంలో మొదటి రెండు దేశాలు ఏవి?

A) చైనా, భారత్‌
B) భారత్‌, రష్యా
C) అమెరికా, కెనడా
D) ఆస్ట్రేలియా, బ్రెజిల్‌

Answer : A) చైనా, భారత్‌



Post a Comment

0 Comments