Ambedkar Overseas Vidya Nidhi Scheme
విదేశాల్లో ఉన్నత విద్యకు ‘అంబేడ్కర్ విద్యానిధి’ పథకం
దళిత విద్యార్థులకు 20 లక్షల విద్యా రుణం
విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే విద్యార్థులకు ‘అంబేడ్కర్ విదేశీ విద్యానిధి’ పథకం సువర్ణవకాశం కల్పిస్తుంది. ఈ పథకం షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో అమలు అవుతుంది. అభ్యర్థులు చదివే కోర్సును బట్టి గరిష్టంగా 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ అభ్యర్థుల ఎంపిక చేస్తుంది. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుండి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ధృవపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకపోతే సాయం నిలిచిపోతుంది.
➺ పథకం పేరు :
- అంబేడ్కర్ విద్యానిధి
➺ ఆర్థిక సాయం:
- 20 లక్షల రూపాయల వరకు
➺ ఎంపిక విధానం :
- జీఆర్‌ఈ / జీమ్యాట్‌లో ప్రతిభ, ఇంటర్యూ ద్వారా
➺ అర్హత :
- ఏదేని డిగ్రిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
- జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత మార్కులు సాధించాలి
- కుటుంబ వార్షికాదాయం 5 లక్షల లోపు ఉండాలి
- దళిత విద్యార్థులు అయి ఉండాలి
- విదేశాల్లో అడ్మిషన్ పొంది ఉండాలి
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- బోనాఫైడ్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- నివాసం సర్టిఫికేట్
- 10వ తరగతి మెమో
- చివరి కోర్సు మార్కుల మెమో
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
- జీఆర్‌ఈ/జీమ్యాట్/ఇతర స్కోర్ కార్డు
- బ్యాంక్ ఖాతా
- విదేశీ విద్యాలయం అడ్మిషన్ లేఖ
- పాస్‌పోర్టు కాపీ
Also Read :
Also Read :

0 Comments