☛ Question No.1
మనిషి శరీరంలోని భాగాల మధ్య సమన్వయాన్ని చేకూర్చే రసాయనాలను ఏమంటారు?
A) నాడీ కణాలు
B) హార్మోన్లు
C) ఎంజైములు
D) విటమిన్లు
Answer : B) హార్మోన్లు
☛ Question No.2
హార్మోన్లు ఏ వ్యవస్థలో భాగం?
A) నాడీ వ్యవస్థ
B) అంత:స్రావక వ్యవస్థ
C) జీర్ణకోశ వ్యవస్థ
D) కండర వ్యవస్థ
Answer : B) అంత:స్రావక వ్యవస్థ
☛ Question No.3
వినాళ గ్రంథులు అనేవి ఎవరిని సూచిస్తాయి?
A) నాళాలతో గ్రంథులు
B) నాళాలు లేని గ్రంథులు
C) జీర్ణక గ్రంథులు
D) చెమట గ్రంథులు
Answer : B) నాళాలు లేని గ్రంథులు
☛ Question No.4
క్రిందివాటిలో ఏది హార్మోన్ రకం కాదు?
A) ప్రోటీన్
B) స్టిరాయిడ్
C) విటమిన్
D) అమైనో ఆమ్ల ఉత్ప్రేరకం
Answer: C) విటమిన్
☛ Question No.5
పియూష గ్రంథి ఎక్కడ ఉంటుంది?
A) మెడలో
B) మెదడు దిగువన
C) హృదయంలో
D) కడుపులో
Answer : B) మెదడు దిగువన
☛ Question No.6
పియూష గ్రంథిని ఇంకేమని అంటారు?
A) హైపోపిసిస్
B) థైమస్
C) అడ్రినల్
D) థైరాయిడ్
Answer: A) హైపోపిసిస్
☛ Question No.7
ప్రసవం సమయంలో గర్భాశయ కండరాల సంకోచం కలిగించే హార్మోన్ ఏది?
A) ఆక్సిటోసిన్
B) ఇన్సులిన్
C) వాపోప్రెసిన్
D) థైమోసిన్
Answer : A) ఆక్సిటోసిన్
☛ Question No.8
మూత్రంలో నీటి శాతాన్ని నియంత్రించే హార్మోన్ ఏది?
A) ఇన్సులిన్
B) వాపోప్రెసిన్
C) కార్టిసోల్
D) టెస్టోస్టిరాన్
Answer : B) వాపోప్రెసిన్
☛ Question No.9
అతిపెద్ద అంత:స్రావక గ్రంథి ఏది?
A) అవటు గ్రంథి
B) క్లోమం
C) పియూష గ్రంథి
D) థైమస్
Answer: A) అవటు గ్రంథి
☛ Question No.10
అవటు గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్లు ఏవి?
A) టి3, టి4
B) ఇన్సులిన్, గ్లూకగాన్
C) అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్
D) ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్
Answer : A) టి3, టి4
☛ Question No.11
టి3, టి4 హార్మోన్లు ఏర్పడటానికి అవసరమైన మూలకం ఏది?
A) కాల్షియం
B) ఆమోడిన్
C) సోడియం
D) ఇనుము
Answer : B) ఆమోడిన్
☛ Question No.12
పార్శ్వ అవటు గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ ఏది?
A) పారాథార్మోన్
B) థైమోసిన్
C) సోమాటోట్రోపిన్
D) కార్టిసోల్
Answer : A) పారాథార్మోన్
☛ Question No.13
లాంగర్‌హెన్స్ పుటికలు ఏ గ్రంథిలో ఉంటాయి?
A) క్లోమం
B) పియూష
C) థైరాయిడ్
D) అధివృక్క
Answer : A) క్లోమం
☛ Question No.14
బీటా కణాల నుండి ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది?
A) గ్లూకగాన్
B) ఇన్సులిన్
C) కార్టిసోల్
D) అడ్రినాలిన్
Answer : B) ఇన్సులిన్
☛ Question No.15
ఇన్సులిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
A) డయాబెటిస్ మిల్లిటస్
B) కుషింగ్ సిండ్రోమ్
C) థైరాయిడ్ టెటనీ
D) ఆక్రోమెగాలి
Answer : A) డయాబెటిస్ మిల్లిటస్
☛ Question No.16
అధివృక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది?
A) హృదయంపై
B) మూత్రపిండాలపై
C) ఊపిరితిత్తులపై
D) మెదడులో
Answer : B) మూత్రపిండాలపై
☛ Question No.17
అధివృక్క గ్రంథి లోపలి భాగం ఏమని పిలుస్తారు?
A) వల్కలం
B) దవ్వ
C) కణజాలం
D) కపటం
Answer : B) దవ్వ
☛ Question No.18
గర్భధారణ సమయంలో గర్భాన్ని నిర్వహించే హార్మోన్ ఏది?
A) ఈస్ట్రోజన్
B) ప్రొజెస్టిరాన్
C) ఆక్సిటోసిన్
D) వాపోప్రెసిన్
Answer : b) ప్రొజెస్టిరాన్
☛ Question No.19
క్రిందివాటిని సరియైన విధంగా జతచేయండి:
ప్యాంక్రియాస్ – (a) పెరుగుదల హార్మోన్
పీయూష గ్రంథి – (b) ఇన్సులిన్
అవటు గ్రంథి – (c) థైరాక్సిన్
అధివృక్క – (d) అడ్రినాలిన్
A) 1–b, 2–a, 3–c, 4–d
B) 1–c, 2–d, 3–a, 4–b
C) 1–a, 2–b, 3–d, 4–c
D) 1–d, 2–a, 3–b, 4–c
Answer: A) 1–b, 2–a, 3–c, 4–d
☛ Question No.20
“ఎమర్జెన్సీ హార్మోన్లు” అంటే ఏమిటి? అవి ఎందుకు ఆ పేరుపొందాయి?
A) థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్ – శరీర మెటాబలిజాన్ని నియంత్రించేందుకు
B) అడ్రినాలిన్ మరియు నార్డ్రినాలిన్ – శరీరాన్ని పోరాట లేదా పార్పుకు సిద్ధం చేయడానికి
C) ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ – ఒత్తిడి సమయంలో రక్త చక్కెరను నియంత్రించడానికి
D) ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరోన్ – గర్భధారణ సమయంలో మాత్రమే
Answer : B) అడ్రినాలిన్ మరియు నార్డ్రినాలిన్ – శరీరాన్ని పోరాట లేదా పార్పుకు సిద్ధం చేయడానికి

0 Comments