Annie Besant Biography in Telugu | అనిబిసెంట్ | Indian History in Telugu 
భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొందరు విదేశీలయులు కూడా పాల్గొన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తి కల్గించడానికి ఎన్నో పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహించి తమ వంతు పాత్ర పోషించారు. అందులో ముందు వరుసులో నిలిచే వ్యక్తి అనిబిసెంట్. బ్రిటన్‌కు చెందిన అనిబిసెంట్ గొప్ప సంఘసంస్కర్త, హోంరూల్ ఉద్యమ స్థాపకురాలు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. 1907లో హెచ్.ఎస్ ఓల్కాట్ మరణించిన తర్వాత అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి రెండో అంతర్జాతీయ అధ్యక్షురాలు అయ్యారు. ఈ పదవిలో ఆమె మరణించేవరకు ఉన్నారు. 1913 నుండి అనిబిసెంట్ భారత రాజకీయాల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ (1917) వార్షిక సమావేశానికి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి విదేశీ మహిళగా గుర్తింపు సాధించారు. మహిళా సమానత్వం, స్వేచ్ఛపై విసృత పోరాటం చేసింది. దేశంలోని స్త్రీల కోసం మహిళా మండల్లు ఏర్పాటు చేసింది. అనిబిసెంట్ 20 సెప్టెంబర్ 1933న మరణించినారు.
అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమం
అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను, బెనారస్‌లో హిందూ పాఠశాలను స్థాపించింది. తర్వాత కాలంలో ఈ పాఠశాలను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. అనిబిసెంట్ యొక్క దత్తత కుమారుడు జిడ్డు కృష్ణ మూర్తి ‘గురువు లేకుండా సత్యము సాధించడం’ అనే సిద్దాంతాన్ని నమ్మేవాడు. కృష్ణమూర్తి 'ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్' అనే పుస్తకాన్ని రచించాడు.
సెప్టెంబర్ 1916లో మద్రాస్ ప్రాంతంలో అనిబిసెంట్ హోంరూల్ లీగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థకు అనిబిసెంట్ అధ్యక్షురాలిగా, రామస్వామి అయ్యర్ జనరల్ సెక్రటరీగా, బిపి వాడి కోశాధికారి నియమితులయ్యారు. 1918లో వాడియా మద్రాసు లేబర్ యూనియన్‌ను స్థాపించాడు. ఇది దేశంలో మొదటి ట్రేడ్ యూనియన్. ఈ ఉద్యమం బొంబాయి, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్సులలో విస్తరించింది. ఆంధ్రాలో జరిగిన హోంరూల్ ఉద్యమానికి గాడిచర్ల హరసర్వోత్తమరావు నాయకత్వం వహించాడు.
1916 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 500లకు పైగా హోంరూల్ శాఖలు ఏర్పడ్డాయి. అనిబిసెంట్ కామన్ వీల్, న్యూ ఇండియా అనే పత్రికలను నడిపి, అనేక వ్యాసాలను అందులో ప్రచురించి భారతీయులను ఉత్తేజ పరిచారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసి ఈ రెండు పత్రికలను నిషేదించారు.
అనిబిసెంట్ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, భూలాబాయ్ దేశాయి, చిత్తరంజన్ దాస్, మదన్‌మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయ్ వంటి నాయకులు హోంరూల్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
Read in English

 
 
 
 
0 Comments