భౌతిక శాస్త్రవేత్త మాక్స్‌ప్లాంక్
Max Planck Biography in Telugu
మాక్స్‌ప్లాంక్ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన జర్మన్ దేశానికి చెందినవారు. ఫిజిక్స్‌లో ‘‘క్వాంటం’’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భౌతికశాస్త్రంలో అభివృద్దిని ప్రోత్సహించినందుకు మాక్స్‌ప్లాంక్‌ను ‘‘ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు’’, ‘‘క్వాంటం సిద్ధాంత పితామహుడు’’ అని పిలుస్తారు. 1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాధించినందుకు 1918లో భౌతిక శాస్త్రంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్ర అభివృద్దికి మాక్స్‌ప్లాంక్ ఎన్నో ప్రయోగాలు, ప్రతిపాదనలు చేశారు.
క్వాంటం సిద్ధాంతం :
క్వాంటం సిద్ధాంతం ప్రకారం విద్యుదయస్కాంత వికిరణం ప్యాకెట్ రూపంలో ఉంటుంది. దీనిని కాంటా అంటారు. క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ వస్తువు వికిరణాన్ని విశదీకరించారు. 1900లో ప్లాంక్ స్థిరాంకంను ప్రవేశపెట్టారు. విశ్వంలోని ప్రాథమిక భౌతిక స్థిరాంకాల్లో ఇది ఒకటిగా పేరుగాంచింది. 1901లో ప్లాంక్ రేడియేషన్ లాను తీసుకువచ్చారు. మాక్స్‌ప్లాంక్ ‘వేర్ ఈజ్ సైన్స్ గోయింగ్’, ‘ఎయిట్ లెక్చర్స్ ఆన్ థియరిటికల్ ఫిజిక్స్’, ‘ది ఆరిజన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది క్వాంటం థియరీ’, ‘ది ఫిలాసఫీ ఆఫ్ ఫిజిక్స్’ అనే రచనలు చేశారు. మాక్స్‌ప్లాంక్ 04 అక్టోబర్ 1947న మరణించినారు.
Also Read :
Also Read :

0 Comments