Biomolecules Gk Questions with Answer in Telugu | General Science Gk Questions in Telugu

Biomolecules Gk Questions with Answer in Telugu

Biomolecules Gk Questions with Answer in Telugu | General Science Gk Questions in Telugu 

☛ Question No.1
జీవుల్లో ప్రధాన శక్తి వనరులు ఏవి?
A) ప్రోటీన్లు
B) కొవ్వులు
C) పిండి పదార్థాలు
D) విటమిన్లు

Answer : C) పిండి పదార్థాలు



☛ Question No.2
పిండి పదార్థాలు ప్రధానంగా ఏ మూలకాలతో నిర్మితమై ఉంటాయి?
A) C, H, O
B) C, H, N
C) C, N, P
D) C, H, S

Answer : A) C, H, O



☛ Question No.3
పిండి పదార్థాలను సాధారణంగా ఏమంటారు?
A) ఆమ్లాలు
B) చక్కెరలు
C) ఎంజైమ్‌లు
D) కొవ్వులు

Answer : B) చక్కెరలు



☛ Question No.4
అత్యంత సరళమైన పిండి పదార్థాలు ఏమిటి?
A) పాలీశాకరైడ్స్‌
B) డైశాకరైడ్స్‌
C) మోనోశాకరైడ్స్‌
D) గ్లైకోజెన్

Answer: C) మోనోశాకరైడ్స్



☛ Question No.5
గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, గాలక్టోజ్‌ ఏ రకానికి చెందినవి?
A) మోనోశాకరైడ్స్‌
B) డైశాకరైడ్స్‌
C) పాలీశాకరైడ్స్‌
D) ప్రోటీన్లు

Answer : A) మోనోశాకరైడ్స్‌



☛ Question No.6
ఆరు కార్బన్లు కలిగిన మోనోశాకరైడ్స్‌ను ఏమంటారు?
A) ట్రయోజ్‌లు
B) హెక్సోజ్‌లు
C) పెంటోజ్‌లు
D) టెట్రోజ్‌లు

Answer: B) హెక్సోజ్‌లు



☛ Question No.7
రెండు మోనోశాకరైడ్స్‌ కలిసినప్పుడు ఏర్పడేది ?
A) మాల్టోజ్‌
B) సెల్యులోజ్‌
C) గ్లైకోజెన్‌
D) స్టార్చ్‌

Answer : B) సెల్యులోజ్‌



☛ Question No.8
సుక్రోజ్‌ ఏ పిండి పదార్థానికి ఉదాహరణ?
A) మోనోశాకరైడ్‌
B) డైశాకరైడ్‌
C) పాలీశాకరైడ్‌
D) లిపిడ్‌

Answer : డైశాకరైడ్‌



☛ Question No.9
సుక్రోజ్‌ ఎక్కడ లభిస్తుంది?
A) పాలు
B) చెరకు
C) బియ్యం
D) గోధుమలు

Answer: B) చెరకు



☛ Question No.10
స్టార్చ్‌, సెల్యులోజ్‌, గ్లైకోజెన్‌ ఏ వర్గానికి చెందుతాయి?
A) డైశాకరైడ్‌లు
B) పాలీశాకరైడ్‌లు
C) మోనోశాకరైడ్‌లు
D) లిపిడ్‌లు

Answer : B) పాలీశాకరైడ్‌లు



☛ Question No.11
మాంసకృత్తులు అనేది ఏ జీవ రసాయనానికి మరో పేరు?
A) కొవ్వులు
B) ప్రోటీన్లు
C) పిండి పదార్థాలు
D) విటమిన్లు

Answer : B) ప్రోటీన్లు



☛ Question No.12
ప్రోటీన్లు ఏ పదార్థాల పాలిమర్లు?
A) కొవ్వు ఆమ్లాలు
B) అమైనో ఆమ్లాలు
C) చక్కెరలు
D) న్యూక్లియోటైడ్స్‌

Answer : B) అమైనో ఆమ్లాలు ‌



☛ Question No.13
అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధం ?
A) అయానిక్‌ బంధం
B) పెప్లైడ్‌ బంధం
C) ఎస్టర్‌ బంధం
D) హైడ్రోజన్‌ బంధం

Answer : B) పెప్లైడ్‌ బంధం ‌



☛ Question No.14
శరీరంలో రసాయనిక చర్యలను వేగవంతం చేసే ప్రోటీన్లు ? A) హార్మోన్లు
B) ఎంజైమ్‌లు
C) విటమిన్లు
D) చక్కెరలు

Answer : B) ఎంజైమ్‌లు ‌



☛ Question No.15
ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ ఏ రకమైన ప్రోటీన్లు?
A) నిర్మాణ ప్రమాణాలు
B) హార్మోన్‌లు
C) ఎంజైమ్‌లు
D) యాంటీబాడీలు

Answer : B) హార్మోన్‌లు ‌



☛ Question No.16
ప్రోటీన్లు ప్రధానంగా ఏ క్రియల్లో పాల్గొంటాయి?
A) ఫోటోసింథసిస్‌
B) రసాయనిక చర్యలు
C) ఆవిర్పాతం
D) నాడీ సంకేతాలు ‌

Answer : B) రసాయనిక చర్యలుy ‌



☛ Question No.17
కండరాల సంకోచానికి అవసరమైన జీవ రసాయనం ?
A) ప్రోటీన్‌
B) కొవ్వు
C) పిండి పదార్థం
D) విటమిన్‌

Answer : A) ప్రోటీన్‌ ‌



☛ Question No.18
కొవ్వులు ప్రధానంగా ఏ విధంగా పనిచేస్తాయి?
A) శక్తి వనరుగా
B) జన్యు పదార్థంగా
C) విటమిన్‌లుగా
D) ఎంజైమ్‌లుగా

Answer : A) శక్తి వనరుగా



☛ Question No.19
సరళ కొవ్వులను ఏమంటారు?
A) గ్లైకోజెన్లు
B) ట్రైగ్లిసరైడ్స్‌
C) స్టెరాయిడ్స్‌
D) మైనం

Answer: B) ట్రైగ్లిసరైడ్స్ ‌



☛ Question No.20
ట్రైగ్లిసరైడ్‌లో ఏమి ఉంటాయి?
A) గ్లూకోజ్‌ అణువులు
B) ఒక గ్లిసరాల్‌ మరియు మూడు కొవ్వు ఆమ్లాలు
C) మూడు చక్కెరలు
D) రెండు అమైనో ఆమ్లాలు

Answer : B) ఒక గ్లిసరాల్‌ మరియు మూడు కొవ్వు ఆమ్లాలు ‌



☛ Question No.21
సంతృప్త కొవ్వు ఆమ్లాల్లో ఉన్న బంధాలు ?
A) ద్వి బంధాలు
B) ఏకబంధాలు
C) త్రిబంధాలు
D) హైడ్రోజన్‌ బంధాలు

Answer : B) ఏకబంధాలు ‌



☛ Question No.22
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎటువంటి బంధాలు కలిగి ఉంటాయి?
A) ఏకబంధాలు మాత్రమే
B) కనీసం ఒక ద్వి బంధం
C) హైడ్రోజన్‌ బంధాలు
D) అయానిక్‌ బంధాలు

Answer : B) కనీసం ఒక ద్వి బంధం‌



☛ Question No.23
పాలి అన్‌సాచ్యురేటేడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఏ ఆరోగ్యానికి తోడ్పడతాయి?
A) చర్మం
B) గుండె
C) జీర్ణక్రియ
D) ఎముకలు

Answer : B) గుండె ‌



☛ Question No.24
కొలెస్టరాల్‌ ఏ రకపు కొవ్వు?
A) సరళ కొవ్వు
B) సంక్లిష్ట కొవ్వు
C) మైనం
D) ఎంజైమ్‌

Answer : B) సంక్లిష్ట కొవ్వు ‌



☛ Question No.25
శరీరంలో కొవ్వు నిల్వ చేసే కణజాలం ?
A) ఎపితీలియల్‌
B) అడిపోజ్‌
C) నాడీ
D) కండర

Answer : B) అడిపోజ్



☛ Question No.26
స్టీరాయిడ్లు, మైనం ఏ వర్గానికి చెందినవి?
A) ప్రోటీన్లు
B) కొవ్వులు
C) పిండి పదార్థాలు
D) విటమిన్లు

Answer : B) కొవ్వులు



☛ Question No.27
విటమిన్లు ఏ మూలకాలను కలిగి ఉంటాయి?
A) కర్బన సమ్మేళనాలు
B) లోహాలు
C) అలోహాలు
D) జల సమ్మేళనాలు

Answer : A) కర్బన సమ్మేళనాలు



☛ Question No.28
విటమిన్లు శరీరంలో ఎంజైమ్‌లకు ఎలా సహకరిస్తాయి?
A) ప్రత్యామ్నాయాలుగా
B) సహా ఎంజైమ్‌లుగా
C) రసాయన పదార్థాలుగా
D) శక్తి మూలంగా

Answer : B) సహా ఎంజైమ్‌లుగా



☛ Question No.29
కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి?
A) A, D, E, K
B) B, C
C) B1, B2, B3
D) F, G

Answer: A) A, D, E, Ki



☛ Question No.30
నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
A) A, D, E, K
B) B కాంప్లెక్స్‌, C
C) B1, D
D) E, K

Answer :B) B కాంప్లెక్స్‌, C



☛ Question No.31
ఆరోగ్యకరమైన దృష్టికి అవసరమైన విటమిన్‌ ? A) D
B) A
C) K
D) C

Answer : B) A



☛ Question No.32
హిమోగ్లోబిన్‌ ఏర్పాటుకు సహాయపడే విటమిన్లు ?
A) B9, B12
B) A, D
C) B2, B3
D) E, K

Answer : A) B9, B12



☛ Question No.33
బలమైన ఎముకల కోసం అవసరమైన విటమిన్‌ ?
A) A
B) D
C) E
D) B1

Answer : B) D



☛ Question No.34
రక్తస్కంధనానికి తోడ్పడే విటమిన్‌ ?
A) E
B) K
C) D
D) C

Answer : B) K



☛ Question No.35
ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన విటమిన్‌ ?
A) E
B) D
C) K
D) B2

Answer : A) E



☛ Question No.36
నోటి ఆరోగ్యానికి, బలమైన చిగుళ్లకు అవసరమైన విటమిన్‌ ?
A) C
B) A
C) E
D) D

Answer : A) C



☛ Question No.37
యాంటీ ఆక్సిడెంట్లుగా వ్యవహరించే విటమిన్లు ? A) B1, B2
B) E, C
C) A, D
D) B9, B12

Answer : B) E, C



☛ Question No.38
కేంద్రకామ్లాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి?
A) శక్తి వనరుగా
B) జన్యు పదార్థంగా
C) ఎంజైమ్‌లుగా
D) విటమిన్‌లుగా

Answer : B) జన్యు పదార్థంగా



☛ Question No.39
డీఎన్‌ఏ యొక్క పూర్తి రూపం ?
A) డీ ఆక్సీ రైబో న్యూక్లిక్‌ యాసిడ్‌
B) డై రైబో న్యూక్లిక్‌ యాసిడ్‌
C) డీ ఆక్సీ రైబో ప్రోటీన్‌
D) రైబో కర్బన యాసిడ్‌

Answer : A) డీ ఆక్సీ రైబో న్యూక్లిక్‌ యాసిడ్‌



☛ Question No.40
ఆర్‌ఎన్‌ఏ యొక్క పూర్తి రూపం ?
A) రైబో న్యూక్లిక్‌ యాసిడ్‌
B) రైబో న్యూక్లియోస్‌ యాసిడ్‌
C) రైబో ప్రోటీన్‌
D) రైబో ఎంజైమ్‌

Answer : A) రైబో న్యూక్లిక్‌ యాసిడ్



☛ Question No.41
ప్రధాన జన్యు పదార్థం ఏది?
A) RNA
B) DNA
C) ప్రోటీన్‌
D) లిపిడ్‌

Answer : B) DNA



☛ Question No.42
కొన్ని వైరస్‌లలో ప్రధాన జన్యు పదార్థం ?
A) DNA
B) RNA
C) ప్రోటీన్‌
D) లిపిడ్‌

Answer :B) RNA



☛ Question No.43
డీఎన్‌ఏ ప్రధానంగా ఏ క్రియను నిర్వహిస్తుంది?
A) శక్తి ఉత్పత్తి
B) వారసత్వ సమాచార నిల్వ
C) రసాయన చర్యలు
D) కణ విభజన

Answer : B) వారసత్వ సమాచార నిల్వ



☛ Question No.44
ఎంజైమ్‌లు ఏ వర్గానికి చెందినవి?
A) ప్రోటీన్లు
B) కొవ్వులు
C) విటమిన్లు
D) పిండి పదార్థాలు

Answer : A) ప్రోటీన్లు



☛ Question No.45
గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వులు ఏవి?
A) సంతృప్త కొవ్వులు
B) అసంతృప్త కొవ్వులు
C) స్టెరాయిడ్లు
D) కొలెస్టరాల్‌

Answer : B) అసంతృప్త కొవ్వులు ‌ 

 


Also Read :




Also Read :


 



Post a Comment

0 Comments