Har Gobind Khorana Biography in Telugu | హర్‌ గోబింద్‌ ఖోరానా – భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త

Har Gobind Khorana Biography in Telugu

 Nobel Prize Winner Har Gobind Khorana – Biography, Research, Achievements in Telugu 

హర్‌ గోబింద్‌ ఖోరానా (Har Gobind Khorana) భారత సంతతికి చెందిన ప్రసిద్ధ అమెరికన్‌ కణజీవ శాస్త్రవేత్త. ఆయన జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణ (Chemical synthesis of genetic material) పై అనేక విప్లవాత్మక పరిశోధనలు చేశారు. ప్రోటీన్‌ సంశ్లేషణలో జన్యుకోడ్‌ పాత్రను వివరించి, జన్యు కోడ్‌ రహస్యాన్ని వెలికితీసినందుకు వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. ఖోరానా చేసిన పరిశోధనలు ఆధునిక జన్యు ఇంజినీరింగ్‌ (Genetic Engineering) మరియు బయోటెక్నాలజీ (Biotechnology) అభివృద్ధికి పునాది వేశాయి. ఆయన కనుగొన్న సిద్ధాంతాల ఆధారంగా జన్యువుల్లో మార్పులు చేయడం, అవాంఛిత లక్షణాలను తొలగించడం, మరియు పారిశ్రామికంగా జన్యువులను ఉత్పత్తి చేయడం వంటి సాంకేతికతలు అభివృద్ధి చెందాయి.

బాల్యం - విద్యాభ్యాసం :

హర్‌ గోబింద్‌ ఖోరానా 1922 జనవరి 9న పంజాబ్‌లోని రాయ్‌పూర్‌లో జన్మించారు. ముల్తాన్‌లోని దయానంద్ ఆంగ్లో వేద ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ఆయన ఉపాధ్యాయుడు రతన్ లాల్ సైన్స్‌పై ఆసక్తి పెంచుకునేలా ప్రేరేపించారు.
తరువాత లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.దేశ విభజన తర్వాత ఖోరానా కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది.పీహెచ్‌.డి పూర్తయ్యాక ఆయన భారత్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University) లో పోస్టు డాక్టోరల్ పరిశోధనలకు ఫెలోషిప్‌ పొంది 1950లో ఇంగ్లండ్‌ వెళ్లారు.

పరిశోధనలు :


కేంబ్రిడ్జ్‌లో ఖోరానా అలెగ్జాండర్ ఆర్. టోడ్ (1957 నోబెల్ విజేత) మరియు జార్జ్ వాలెస్ కన్నర్ వంటి ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు.పెప్టైడ్లు (Peptides) మరియు న్యూక్లియోటైడ్లు (Nucleotides) పై విశేష పరిశోధనలు చేశారు.ఈ కాలంలో ఆయన జీవకణాల్లో జరిగే రసాయన ప్రక్రియలను సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ద్వారా అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగారు.

శాస్త్రీయ కృషి :

  •  అమెరికన్ బయోకెమిస్ట్‌ మార్షల్ వారెన్ నైరెన్‌బర్గ్ ప్రతిపాదించిన జన్యుకోడ్ నమూనాను ఖోరానా ధ్రువీకరించారు. న్యూక్లియోటైడ్ కోడ్ ఎల్లప్పుడూ మూడు సమూహాలుగా ఉండి కోడాన్లు (Codons) గా కణాలకు సమాచారాన్ని అందిస్తుందని ఆయన నిరూపించారు.

  •  డీఎన్‌ఏ ప్రతిరూపణ (DNA replication) సంక్లిష్ట ప్రక్రియలో ఎంజైమ్‌ల పాత్రను విశదీకరించారు.
  •  ప్రయోగశాలలో కృత్రిమంగా డీఎన్‌ఏ సంశ్లేషణ చేసిన తొలి శాస్త్రవేత్త కూడా ఆయనే.

 


Also Read :




Also Read :


 

 

 

 

Post a Comment

0 Comments