Marie Curie Biography in Telugu | మేరీ క్యూరీ జీవిత చరిత్ర | Biography in Telugu

 

Marie Curie Biography in Telugu

 మేరీ క్యూరీ జీవిత చరిత్ర | Marie Curie Biography in Telugu

మేరీ క్యూరీ (Marie Curie) ప్రపంచ ప్రసిద్ధ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త. ఆమెను “మేడం క్యూరీ” (Madam Curie) అని కూడా పిలుస్తారు. రేడియోధార్మికత (Radioactivity) పై చేసిన ఆమె పరిశోధనలు శాస్త్ర ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ప్రస్తుతం రేడియోధార్మిక పదార్థాలు వైద్య, పరిశ్రమ, మరియు శాస్త్ర పరిశోధన రంగాల్లో విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ఇవి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

మేరీ క్యూరీ బాల్యం మరియు విద్య :

మేరీ క్యూరీ 1867 నవంబర్‌ 7న పోలాండ్‌లోని వార్సా (Warsaw) నగరంలో జన్మించారు. ఆమె అసలు పేరు మారియా సలోమియా స్లోడోవ్‌స్కా (Maria Salomea Skłodowska). బాల్యంలోనే సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందిన మేరీ, ఎక్కువ సమయం చదువుకోవడంలో గడిపేవారు.

ఆమె పాఠశాల విద్యను బోర్డింగ్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. 1883లో జిమ్నాసియం పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు పతకం (Gold Medal) అందుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా  కాలేజీ చదువును కొనసాగించలేకపోయారు.

తర్వాత ట్యూషన్లు చెప్పడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఉన్నత విద్యకు సిద్ధమయ్యారు. 1891లో క్యూరీ ఫెలోషిప్‌ (Curie Fellowship) ద్వారా ఫ్రాన్స్‌లోని సోర్బోన్‌ విశ్వవిద్యాలయం (University of Sorbonne, Paris) లో చేరారు. అక్కడ భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితంలో లోతైన అధ్యయనం చేశారు.

మేరీ క్యూరీ వృత్తి మరియు పరిశోధనలు :

మేరీ క్యూరీ తన చదువుతోపాటు లిప్‌మన్‌ రిసెర్చ్‌ ల్యాబోరేటరీ (Lippmann Research Laboratory) లో పనిచేశారు.

  • 1893లో భౌతికశాస్త్రంలో డిగ్రీ పొందారు.
  • 1894లో గణితంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

తర్వాత ఆమె శాస్త్రవేత్త పియర్‌ క్యూరీ (Pierre Curie) ను వివాహం చేసుకుని ఇద్దరూ కలసి రేడియోధార్మికతపై అనేక పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల ఫలితంగా పోలోనియం మరియు రేడియం అనే రెండు కొత్త మూలకాలను కనుగొన్నారు.

మేరీ క్యూరీ ప్రధాన పురస్కారాలు మరియు గౌరవాలు :

మేరీ క్యూరీ అనేక దేశీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
ఆమె పొందిన ముఖ్యమైన బహుమతులు:

  • 1903 – డేవీ మెడల్‌ (Davy Medal)
  • 1904 – మాట్యుచీ మెడల్‌ (Matteucci Medal)
  • 1907 – అక్టోనియన్‌ బహుమతి (Actonian Prize)
  •  1909 – ఇలియట్‌ క్రైసన్‌ పతకం (Eliott Cresson Medal)
  • 1921 – అమెరికన్‌ ఫిలాసాఫికల్‌ సొసైటీ నుండి ఫ్రాంక్లిన్‌ మెడల్‌ (Franklin Medal) 

Post a Comment

0 Comments