Meghnad Saha Biography in Telugu | మేఘనాధ్ సాహా
ఖగోళ భౌతిక శాస్త్రం (ఆస్ట్రో ఫిజిక్స్) లో అనేక పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా. ఈయన నక్షత్రాల్లో భౌతిక, రసాయన పరిస్థితులను వివరించడానికి ‘‘సాహా ఆయనీకరణ’’ సమీకరణాన్ని అభివృద్ది చేశారు. ఖగోళంలో జరిగే రహస్యాలను విశ్లేషించడానికి ఈయన చేసిన పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయి.
విద్యాభ్యాసం :
ఈయన 06 అక్టోబర్ 1893న షియోరతాలి (బంగ్లాదేశ్) లో జన్మించారు. 1911లో ఢాకా కాలేజ్‌లో ఇంటర్మిడియట్ పూర్తి చేశారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1913 లో బీఎస్సీ (గణితం), 1915లో ఎంఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేశారు. 1916లో కలకత్తాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో లెక్చరర్‌గా నియామకమయ్యారు.
పురస్కారాలు :
1927లో రాయల్ సొసైటీకి ఫెలోగా పనిచేశారు. 1934లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 21వ సెషన్‌కు అధ్యక్షత వహించారు. 1952లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని క్యాలెండర్ సంస్కరణ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.
Also Read :
Also Read :

0 Comments