Nobel Prize 2025 winners list in Telugu || నోబెల్‌ బహుమతులు || Gk in Telugu || General Knowledge in Telugu

nobel prize winners 2025 in telugu

నోబెల్‌ బహుమతులు - 2025

Who are the 2025 Nobel Prize winners ?

Gk in Telugu || General Knowledge in Telugu

Gk in Telugu  ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 


నోబెల్‌ బహుమతి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి కనబర్చిన వారికి అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం. ఇది ప్రపంచంలో అందించే అత్యుత్తమ పురస్కారం. ఈ నోబెల్‌ బహుమతిని 1901 సంవత్సరం నుండి ఆల్ప్రేడ్‌ బెర్నార్డ్‌ నోబెల్‌ జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబర్‌ 10న నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు. ఈ నోబెల్‌ అవార్డును 1) సాహిత్యం 2)  శాంతి 3) రసాయన శాస్త్రం 4) వైద్య శాస్త్రం 5) భౌతిక 6) ఆర్థిక శాస్త్రం వంటి 6 రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి బహుకరిస్తారు.

 

నోబెల్‌ బహుమతి - 2025

వైద్య శాస్త్రం : 

వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి 2025 సంవత్సరానికి గాను మేరీ ఈ.బ్రంకోవ్‌, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీలకు ముగ్గురికి ఉమ్మడి దక్కింది. మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అత్యంత కీలకమని, ఈ రోగనిరోధక శక్తి బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేసినప్పుడు గుర్తించి అడ్డుకుంటూ మానవ ఆరోగ్యాన్ని కాపాడతాయని అలాగే రోగ నిరోధక వ్యవస్త శరీరంలో సొంత కణాలపై దాడి చేయకుండా నియంత్రిత టీ-కణాలు (స్పెషల్‌ ఇమ్యూన్‌ సెల్స్‌) ఎలా పనిచేస్తాయో వివరించినందుకు గాను ఈ ముగ్గురికి వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. 

11

టీ-కణాలు : 

బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికారకాలను గుర్తించి పోరాడేందుకు వీలుగా రోగనిరోధక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న వ్యవస్థలలో టీ`సెల్స్‌ కీలకమైనవి. ఈ టీసెల్స్‌ అప్పుడప్పుడు ఈ కణాల్లో కొన్ని విపరీతంగా ప్రవర్తించి, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు కారణమయ్యే ముప్పు ఉంటుంది. అలాంటి విపరీత కణాలను రోగనిరోధక వ్యవస్థ థైమస్‌లో అంతం చేస్తుంటుంది. ఈ విధానాన్ని ‘‘సెంట్రల్‌ టాలరెన్స్‌’’ అంటారు. ఈ వ్యవస్థను నియంత్రణలో ఉంచేందుకు శరీరం అనుసరిస్తున్న మార్గాన్ని మేరీ ఈ.బ్రంకోవ్‌, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీలకు ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

నోబెల్ వైద్యశాస్త్రం విజేతలు 

మేరీ ఈ.బ్రంకోవ్‌ (అమెరికా)

ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ (అమెరికా)

డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీ (జపాన్)

 

భౌతిక శాస్త్రం 

భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ 2025కు గాను ముగ్గురిని వరించింది. జాన్‌క్లార్క్‌(అమెరికా), జాన్‌ మార్టిన్‌(అమెరికా), హెచ్‌ డెవోరెట్‌ (ప్రాన్స్‌) ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్‌ మెకానిక్స్‌లో చేసిన పరిశోదనలకు గాను 2025 భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి లభించింది. 

ఏమిటీ క్వాంట్‌ మెకానిక్స్‌ పరిశోధన ?

మ్యాక్రోస్కోపిక్‌ క్వాంటమ్‌ మెకానికల్‌ టన్నెలింగ్‌, విద్యుత్‌ సర్క్యూట్‌లో శక్తి పరిమాణీకరణ. వీరి పరిశోధనల ద్వారా క్వాంటమ్‌ ఫిజిక్స్‌ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్‌లో ఇమిడుతుందని చూపగలిగారు. విద్యుత్‌ సర్క్యూట్‌లో క్వాంటమ్‌ టన్నెలింగ్‌, శక్తి స్థాయి పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించినందుకు గాను వీరికి ఈ బహుమతి లభించింది. 

క్వాంటమ్‌ టన్నెలింగ్‌ అంటే ?

ఒక కణం వెళ్లే మార్గంలో ఒక గోడలాంటిది అడ్డుపడితే అది దానిని దాటి వెళ్లలేదు. కానీ క్వాంట్‌ మెకానిక్స్‌ వల్ల కణం అడ్డుగోడను లెక్కచేయకుండా వెళ్లగలదు. దీనినే ‘క్వాంటమ్‌ టన్నెలింగ్‌’ అంటారు.


ఇది ఎలా పనిచేస్తుంది ?

సాధారణ కంప్యూటర్లలో ఉన్న బిట్‌లకు భిన్నంగా క్వాంటమ్‌ కంప్యూటర్లలో ‘క్విబిట్‌’ లు ఉంటాయి. ఒక బిట్‌ 0 లేదా 1లో ఏదో ఒకటి మాత్రమే ఉండగలదు. కానీ క్విబిట్‌లో మాత్రం ఒకే సమయంలో 0 గానూ, 1 గాను ఉండే వీలుంటుంది.  

నోబెల్‌ బహుమతి భౌతిక శాస్త్ర విజేతలు

  • జాన్‌క్లార్క్‌ - అమెరికా 
  • జాన్‌ మార్టిన్‌ - అమెరికా 
  • హెచ్‌ డివోరెట్‌ - అమెరికా 
 

రసాయన శాస్త్రం 

లోహ సేంద్రియ చట్రాలను (మెటల్‌`ఆర్గానిక్‌ ఫ్రేమ్‌ వర్క్స్‌) అభివృద్ది చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఓమర్‌ ఎం.యాఫీు ముగ్గురికి నోబెల్‌ బహుమతి వరించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు భారీ కుహరాలతో కూడిన మాలిక్యులర్‌ నిర్మాణాలను సృష్టించినందుకు, వీటి ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌ వంటి వాయువులు స్వేచ్ఛగా లోపలికి బయటకు ప్రవహిస్తాయని వెల్లడిరచినందుకు నోబెల్‌ బహమతి వరించింది. ఎడారుల్లో పొడి గాలి నుండి తేమ / నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించడం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. 

ఏమిటీ మెటల్‌ - ఆర్గానిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ?

ఈ మాలిక్యులర్‌ నిర్మాణాలు, లోహ సేంద్రియ చట్రాలు ఎడారిలో గాలి నుండి నీటిని సేకరించడానికి, కార్భన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించడానికి, విషపూరిత వాయువులు లేదా ఉత్ప్రేరక రసాయన ప్రతిచర్యలను నిల్వ చేయడానికి తోడ్పడతాయని తెలియజేస్తుంది. 
రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన వారు : 
  • సెసీము కిటగావా (జపాన్)
  • రిచర్డ్‌ రాబ్సన్‌ (ఆస్ట్రేలియా)
  • ఓమర్‌ ఎం యాగి (అమెరికా)

సాహిత్యం 

నాగరికత విధ్వంసం మధ్యలోనూ కళశక్తిని పునరుద్ఘాటిస్తు దూరదృష్టితో రచనలు చేసిన లాస్లో క్రస్నహోర్కాయ్‌కి ప్రతిష్టాత్మక నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. లాస్లో రచించిన ‘శాటన్‌ టాంగో’, ది మెలాన్కలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ వంటి నవలలు హంగరీ దర్శకుడు బెలా టార్‌ వెండితెరకు ఎక్కించారు. 

సాహిత్య నోబెల్‌ విజేత :
  • లాస్లో క్రస్నహోర్కాయ్‌ - హంగరీ

 

శాంతి బహుమతి

వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో అవిశ్రాంత కృషి చేసిన, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి పోరాటం చేసిన వెనిజులా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకు 2025 నోబెల్‌ శాంతిబహుమతి లభించింది. 
    వెనిజులాలో ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలిగా, వెనిజులా ఉక్కు మహిళగా మరియా కొరినా మచాడోకు పేరు ఉంది. వెనిజులా దేశంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆమె అలుపులేని పోరాటానికి, ప్రజల తరపున నిలబడిన తీరుకు మరియా కొరినా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. నోబెల్‌ శాంతి బహుమతి పొందిన 20వ మహిళ మరియా కొరినా మచాడో.

నోబెల్‌ శాంతిబహుమతి -  మరియా కొరినా మచాడో ( వెనిజులా) 

నోబెల్‌ ఎకనామిక్స్‌ 

ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే, అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే ‘సృజనాత్మక విధ్వంసం’ భావనను మరింత ప్రభావంతంగా వివరించిందుకు గాను 2025 ఏడాదికి ఎకనమిక్స్‌ నోబెల్‌ జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియన్‌, పీటర్‌ హోవిట్‌లకు దక్కింది. వీరి ఆవిష్కరణ ద్వారా కొత్త ఉత్పత్తులు, తయారీ విధానాలకు కొత్త ఆవిష్కరణలు ఏ రకంగా దోహదపడతాయో వివరించారు. 
ఏమిటీ సృజనాత్మక విధ్వంసం :
పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్త ఆవిష్కరణలు భర్తీ చేస్తున్నప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక్కటి పరిశీలిస్తే సరిపోదు. అసలు ఆ కొత్త ఆవిష్కరణ ఏ రకంగా విషయం సాధిస్తుందనేది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. లాభదాయక కొత్త ఆవిష్కరణలు కాలక్రమంలో పాత ఆవిష్కరణల స్థానాన్ని భర్తీ చేయడం, తద్వారా వాటిని రూపుమాపడం సహాజం ఆర్థిక శాస్త్రంలో దీన్నే ‘సృజనాత్మక విధ్వంసం (క్రియేటివ్‌ డిస్ట్రక్షన్‌)’ అంటారు.  

నోబెల్‌ ఎకనామిక్స్‌ 2025 విజేతలు 

జోయెల్‌ మోకిర్‌ (నెదర్లాండ్స్ / యూఎస్ఏ)

ఫిలిప్‌ అఘియన్‌ (ఫ్రాన్స్)
పీటర్‌ హోవిట్‌ల (కెనడా /
యూఎస్ఏ)



 

 

 

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments