Types of Forest in India Gk Questions in Telugu | Indian Geography Quiz Questions
అడవులు జీకే ప్రశ్నలు - జవాబులు
☛ Question No. 1
“ఉష్ణమండల సతతహరిత అడవులు” ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి?
A) గంగా మైదానాలు
B) పశ్చిమ కనుమలు
C) థార్ ఎడారి
D) మధ్యప్రదేశ్
Answer : B) పశ్చిమ కనుమలు
☛ Question No. 2
సతతహరిత అడవులు పెరిగేందుకు కనీస వర్షపాతం ?
A) 100 సెం.మీ
B) 150 సెం.మీ
C) 200 సెం.మీ
D) 50 సెం.మీ
Answer : C) 200 సెం.మీ
☛ Question No. 3
సతతహరిత అడవుల చెట్ల ఎత్తు ఎంత ఉంటుంది ?
A) 10–20 మీటర్లు
B) 30–40 మీటర్లు
C) 60 మీటర్లకు పైగా
D) 15 మీటర్లు
Answer : C) 60 మీటర్లకు పైగా
☛ Question No. 4
సతతహరిత అడవుల్లో చెట్లు ఆకులు రాల్చవు ఎందుకంటే ?
A) తేమ వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది
B) నీరు తక్కువగా ఉంటుంది
C) ఎత్తైన పర్వతాలు ఉంటాయి
D) మట్టి పొడి ఉంటుంది
Answer : A) తేమ వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది
☛ Question No. 5
సతతహరిత అడవుల్లో కనిపించే చెట్లు ఏవి ?
A) రోస్‌వుడ్, మహగని, ఎబోని
B) సాల, తేక్
C) బాబుల్, వేప
D) పైన్స్, దేవదారు
Answer : A) రోస్‌వుడ్, మహగని, ఎబోని
☛ Question No. 6
ఆకురాల్చు అడవులను ఇంకేమంటారు?
A) రుతుపవన అడవులు
B) తేమ అడవులు
C) చిత్తడి అడవులు
D) ఎడారి అడవులు
Answer : A) రుతుపవన అడవులు
☛ Question No. 7
ఆకురాల్చు అడవుల్లో వర్షపాతం ఎంత ?
A) 50 సెం.మీ కంటే తక్కువ
B) 70–200 సెం.మీ మధ్య
C) 200 సెం.మీ పైగా
D) 30–50 సెం.మీ
Answer : B) 70–200 సెం.మీ మధ్య
☛ Question No. 8
ఆకురాల్చు అడవులు రెండు రకాలు అవి ?
A) పొడి, తేమ
B) ఎడారి, చిత్తడి
C) పర్వత, సతతహరిత
D) గడ్డి, మడ
Answer : A) పొడి, తేమ
☛ Question No. 9
ఆకురాల్చు అడవుల్లో కలప ఎలా ఉంటుంది ?
A) తేలికగా ఉంటుంది
B) గట్టిగా ఉంటుంది
C) మృదువుగా ఉంటుంది
D) తక్కువ విలువగలది
Answer : B) గట్టిగా ఉంటుంది
☛ Question No. 10
ఆకురాల్చు అడవులు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి?
A) హిమాలయ ప్రాంతంలో
B) మధ్య భారతదేశంలో
C) థార్ ఎడారిలో
D) అండమాన్ దీవుల్లో
Answer : B) మధ్య భారతదేశంలో
☛ Question No. 11
చిట్టడవులు ఏర్పడే వర్షపాతం ఎంత ?
A) 200 సెం.మీ పైగా
B) 100 సెం.మీ
C) 50 సెం.మీ కంటే తక్కువ
D) 75–100 సెం.మీ
Answer : C) 50 సెం.మీ కంటే తక్కువ
☛ Question No. 12
చిట్టడవుల్లో ప్రధానంగా కనిపించే మొక్కలు ఏవి ?
A) గడ్డి, ముళ్ల పొదలు
B) పెద్ద చెట్లు
C) తేమ చెట్లు
D) చందన చెట్లు
Answer : A) గడ్డి, ముళ్ల పొదలు
☛ Question No. 13
చిట్టడవులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి?
A) గంగా మైదానాలు
B) పంజాబ్, రాజస్థాన్, గుజరాత్
C) ఈశాన్య రాష్ట్రాలు
D) పశ్చిమ కనుమలు
Answer : B) పంజాబ్, రాజస్థాన్, గుజరాత్
☛ Question No. 14
చిట్టడవుల్లో కనిపించే చెట్లు ఏవి ?
A) బాబుల్, వేప, ఉసిరి
B) రోస్‌వుడ్, ఎబోని
C) ఓక్, పైన్స్
D) సుందరి చెట్లు
Answer : A) బాబుల్, వేప, ఉసిరి
☛ Question No. 15
చిట్టడవుల్లో పెరిగే గడ్డి ఏది ?
A) టుస్సాకీ గడ్డి
B) బెంబూ
C) సతతహరిత గడ్డి
D) తేమ గడ్డి
Answer : A) టుస్సాకీ గడ్డి
☛ Question No. 16
పర్వతీయ అడవులు ప్రధానంగా ఎక్కడ ఉంటాయి?
A) తీరప్రాంతాలు
B) పర్వత ప్రాంతాలు
C) ఎడారి ప్రాంతాలు
D) డెల్టా ప్రాంతాలు
Answer : B) పర్వత ప్రాంతాలు
☛ Question No. 17
హిమాలయ దిగువ ప్రాంతాల్లో ఏ రకపు అడవులు ఉంటాయి?
A) సతతహరిత
B) ఆకురాల్చు
C) చిట్టడవులు
D) చిత్తడి అడవులు
Answer : B) ఆకురాల్చు
☛ Question No. 18
1500–1750 మీటర్ల ఎత్తులో కనిపించే చెట్లు ఏవి ?
A) దేవదారు
B) ఫైన్
C) ఓక్
D) సుందరి
Answer : B) ఫైన్
☛ Question No. 19
హిమాలయాల్లో ప్రసిద్ధ చెట్లు ఏవి ?
A) దేవదారు చెట్లు
B) వేప చెట్లు
C) తాటి చెట్లు
D) బాబుల్ చెట్లు
Answer : A) దేవదారు చెట్లు
☛ Question No. 20
3000–4000 మీటర్ల ఎత్తులో కనిపించే చెట్లు ఏవి ?
A) ఓక్, చెస్ట్‌నట్
B) సిల్వర్‌ఫిర్, జునిపెర్స్, రోడోడెండ్రోన్స్
C) బాబుల్, వేప
D) సాల, తేక్
Answer : B) సిల్వర్‌ఫిర్, జునిపెర్స్, రోడోడెండ్రోన్స్
☛ Question No. 21
చిత్తడి అడవులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి?
A) ఎడారి ప్రాంతాలు
B) పర్వతాలు
C) డెల్టాలు, తీరప్రాంతాలు
D) అంతర్గత మైదానాలు
Answer : C) డెల్టాలు, తీరప్రాంతాలు
☛ Question No. 22
చిత్తడి అడవులను ఇంకేమంటారు?
A) టైడల్ ఫారెస్టు
B) సతతహరిత అడవులు
C) రుతుపవన అడవులు
D) ఎడారి అడవులు
Answer : A) టైడల్ ఫారెస్టు
☛ Question No. 23
చిత్తడి అడవులు పెరిగే నీటి రకం ?
A) మంచినీరు మాత్రమే
B) ఉప్పునీరు మాత్రమే
C) మంచినీరు, ఉప్పునీరు రెండూ
D) వర్షనీరు మాత్రమే
Answer : C) మంచినీరు, ఉప్పునీరు రెండూ
☛ Question No. 24
సుందర్‌బన్ చిత్తడి అడవి ఏ నది డెల్టాలో ఉంది?
A) గోదావరి
B) గంగా
C) కృష్ణా
D) కావేరి
Answer : B) గంగా
☛ Question No. 25
సుందర్‌బన్ అడవిలో ప్రసిద్ధ చెట్లు ఏవి ?
A) సుందరి చెట్లు
B) బాబుల్ చెట్లు
C) తేక్ చెట్లు
D) ఎబోని చెట్లు
Answer : A) సుందరి చెట్లు
☛ Question No. 26
భారతదేశంలో 2023 నాటికి అడవులు, చెట్లు కలిపి విస్తీర్ణం ఎంత ?
A) 21%
B) 25.17%
C) 33%
D) 30%
Answer : B) 25.17%
☛ Question No. 27
అందులో అడవులు మాత్రమే ఎంత శాతము ఉంటాయి ?
A) 21.76%
B) 3.41%
C) 25%
D) 33%
Answer : A) 21.76%
☛ Question No. 28
భారతదేశంలో అత్యధిక అడవి విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది ?
A) మధ్యప్రదేశ్
B) అరుణాచల్‌ప్రదేశ్
C) ఛత్తీస్‌గఢ్
D) మహారాష్ట్ర
Answer : A) మధ్‌యప్రదేశ్
☛ Question No. 29
జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో ఎంత శాతం అడవులు ఉండాలి?
A) 21%
B) 25%
C) 33%
D) 40%
Answer : C) 33%
☛ Question No. 30
అడవులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి ?
A) వర్షాభావం
B) మానవ ఆవాసం, సాగు కోసం నరికివేత
C) జంతువుల వేట
D) తేమ ఎక్కువ కావడం
Answer : B) మానవ ఆవాసం, సాగు కోసం నరికివేత

0 Comments