Ande sri Biography in Telugu
తెలంగాణ సాహితీ దిగ్గజం అందెశ్రీ
తెలంగాణ సాహితీ దిగ్గజం, ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ సిద్దిపేట జిల్లా, మద్దూర్ మండలం, రేబర్తి గ్రామంలో 18 జులై 1961 న జన్మించారు. ఆయనకు భార్య మల్లుబాయి, ముగ్గురు కూతుళ్లు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రచించారు. మాక్లూర్ మండలం అమ్రాద్‌లో ఆశ్రమాన్ని నడిపిన శంకర్ మహారాజ్ ఎల్లయ్యకు అందెశ్రీగా నామకరణం చేశారు. వేదాలు, ఉపనిషత్తులు బోధించారు. అందెశ్రీ 10 నవంబర్ 2025న అనారోగ్యంతో మరణించారు.
రచనలు :
- పాటల పూదోట
- అందెల సందడి
గేయాలు :
- జయ జయహే తెలంగాణ ..
- పల్లె నీకు వందనాలమ్మా
- మాయమై పోతున్నడమ్మ
- గలగల గజ్జెల బండి
- కొమ్మ చెక్కితే బొమ్మరా
- జనత జాతరలో మన గీతం
- యెల్లిపోతున్నావా తల్లి
- చూడచక్కని
- ఆవారాగాడు
పురస్కారాలు :
- ఎర్ర సముద్రం చిత్రం కోసం రాసిన ‘మాయమైపోతున్నడమ్మా’ పాటను ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో చేర్చారు.
- కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు.
- అకాడమీ ఆప్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో పాటు ‘లోకకవి’ అనే బిరుదుతో సన్మానించింది.
- వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి దాశరథి సాహితీ పురస్కారం లభించింది.
- రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015)
- సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం (2022)
- దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2024)
- లోక్‌నాయక్ ఫౌండేషన్ వారిచే లోక్ నాయక్ పురస్కారం
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటి నజరానా (2025)

0 Comments