టాప్ యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కొరకు బిట్‌శాట్ - 2026 అడ్మిషన్ టెస్ట్
భారతదేశంలో ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థల్లో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్ (బిట్స్) ముఖ్యమైనవి. ఇందులో పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లు ముఖ్యమైనవి. ఈ క్యాంపస్‌లలో బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్మిడియట్ విద్యార్హతతో బిట్స్ నిర్వహించే అడ్మిషన్‌టెస్టు అర్హత సాధించవచ్చు. తాజాగా బిట్‌శాట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
అడ్మిషన్ టెస్టు :
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్ (బిట్స్)
కోర్సులు :
- బీఈ
- బీఫార్మసీ
- ఎమ్మెస్సీ
విద్యార్హత :
- ఇంజినీరింగ్ ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ, బీఫార్మసీకి బైపీసీ లేదా ఎంపీసీ ఉండాలి.
- కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- 2026 ఇంటర్ పరీక్షలు రాస్తున్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు.
- బైపీసీ విద్యార్థులు బీఈ`ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ కోర్సుకూ అర్హులే
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ధరఖాస్తు ఫీజు :
సెషన్ - 1
రూ॥3600/- (అబ్బాయిలు)
రూ॥3100/-(అమ్మాయిలు)
సెషన్ - 1 అండ్ 2
రూ॥5600/- (అబ్బాయిలు)
రూ॥4600/-(అమ్మాయిలు)
ఆన్‌లైన్ ధరఖాస్తు :
సెషన్ - 1 లేదా సెషన్-1 అండ్ 2 రెండిటికీ కలిపి మార్చి 16 వరకు
సెషన్ - 2 కోసం 20 ఏప్రిల్ నుండి 2 మే 2026 లోగా ధరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ పరీక్షలు :
15 ఏప్రిల్ నుండి 26 మే వరకు నిర్వహిస్తారు.
For Online Apply

0 Comments