Amartya Sen Biography in Telugu | అమర్త్యసేన్‌

Amartya Sen

 అమర్త్యసేన్‌ | Amartya Sen

పరిచయం :

అమర్త్యసేన్‌ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధి వంటి అంశాలపై చేసిన పరిశోధనల ద్వారా ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కేవలం ఆర్థిక వృద్ధి కాకుండా, ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం గడపడానికి అవసరమైన అవకాశాలు, స్వేచ్ఛలు కల్పించడమే అభివృద్ధి అని ఆయన నమ్మకం.

ముఖ్య సిద్ధాంతాలు :

1960–70 దశకాల్లో అమర్త్యసేన్‌ సామాజిక ఎంపిక సిద్ధాంతం (Social Choice Theory)ను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని కేవలం జీడీపీతోనే అంచనా వేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఆదాయం మాత్రమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛలు, సామర్థ్యాల అభివృద్ధి, సమాన అవకాశాలు, అసమానతల తగ్గింపు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ఆలోచనలే సంక్షేమ ఆర్థికశాస్త్రం (Welfare Economics)కు పునాది అయ్యాయి.

అవార్డులు :

అమర్త్యసేన్‌ అనేక అంతర్జాతీయ ఆర్థిక సంఘాలకు అధ్యక్షునిగా సేవలందించారు. 1998లో నోబెల్‌ బహుమతితో పాటు, ఆర్డర్‌ ఆఫ్‌ కంపానియన్‌ ఆఫ్‌ ఆనర్‌, లియోంటీఫ్‌ ప్రైజ్‌, ఐసెన్‌హోవర్‌ పతకం, జోహన్‌ స్కైట్‌ బహుమతి, జర్మన్‌ బుక్‌ట్రేడ్‌ శాంతి బహుమతి వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. అమర్త్యసేన్‌ ఆలోచనలు నేటికీ మానవాభివృద్ధి, సామాజిక న్యాయం అంశాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Post a Comment

0 Comments